అష్టవిధ వివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వివరణ: clean up, replaced: ప్రశక్తి → ప్రసక్తి using AWB
పంక్తి 13:
 
==వివరణ==
 
;బ్రాహ్మం
::ప్రతిఫల రహితంగా యోగ్యుడైన వరునకు అలంకరించబడిన [[కన్య]] ను ఇచ్చి వివాహం చెయ్యడం.. తలిదండ్రులు శక్తి కొలది వస్త్రభూషణాదులతో తమ [[కూతురు]] ను అలంకరించి తగిన సమర్దుడైన వరుని చూసి కూతురి చేతిని అతని చేతిలో కలపి పాణిగ్రహణం చేస్తారు.
 
;దైవం
::యజమాని గృహంలో దైవ [[యజ్ఞం]] చేసి యజ్ఞాంతములో ఋత్విజునికి ధారాపూర్వకంగా కన్యను ఇచ్చి వివాహం చెయ్యడం.
 
;ప్రాజాపత్యం
::కేవలం సంతానం కోసం చేసుకునే వివాహం. వదూవరులు ఒకచోట సుఖంగా ధర్మాచరణ చేసుకొంటూ జీవిస్తారనే బుద్దితో వరునికి కన్యనిచ్చి వివాహం చేయడం. ఈ ప్రక్రియలో [[కట్నం]], [[కన్యాశుల్కం]] అనే ప్రసక్తి ఉండదు.
 
;ఆర్షం
::వేదవిహితంగా చేసుకునే వివాహం. కన్య తల్లి దండ్రులకు వరుడు కొన్ని ఉపకరణాలు అనగా ఆవు లేదా ఎద్దు లేదా కొన్ని మేకలు ఇలా ఇచ్చి కన్యను/కన్యాదానమును గ్రహించడం.
 
;ఆసురం
::వదువు వైపువారికి శుల్కమును/ధనము ఇచ్చి కన్యాధానము గ్రహించడం.
 
;గాంధర్వం
::వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహం. పెద్దల అనుమతితో ప్రమేయము లేక ఇరువురు ఇష్టముతో పాణిగ్రహణము చేసుకొనడం.
 
;పైశాచం
::కన్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునే వివాహం. వదువు ఏమరుపాటుగా ఉన్నపుడు గాని, నిద్రిస్తున్నపుడు గాని, చేసుకొనే ఈ వివాహాన్ని అధమాధమమైనదిగా పరిగణిస్తారు.
 
;రాక్షసం
::కన్య ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి చేసుకొనే వివాహం. ఇలాంటి వివాహాలు పలు పురాణాలలో కానవస్తాయి.
 
ఈ విధములైన అష్ట విధ వివాహాలు యాజ్ఞవల్కస్మృతిలో కానవస్తాయి. ఇవే కాక హిందూ సాంప్రదాయంలో [[స్వయంవరం]] అనే మరొక సాంప్రదాయ వివాహం చూడచ్చు. శివదనుస్సును విరిచి [[శ్రీరాముడు]] [[సీత]] ను పెళ్ళాడినది. మత్యయంత్రమును ఎక్కుపెట్టీ [[ద్రౌపదిని]] [[అర్జునుడు]] చేపట్టినది ఈపద్దతినే.
"https://te.wikipedia.org/wiki/అష్టవిధ_వివాహాలు" నుండి వెలికితీశారు