మందాడి ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''ప్రభాకర రెడ్డి''' గా ప్రసిద్ధులైన '''డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి''' ([[అక్టోబర్ 8]], [[1935]] -[[నవంబర్ 26]], [[1997]]) ప్రముఖ [[తెలుగు]] సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని [[హిందీ భాష|హిందీ]], [[తమిళ భాష|తమిళ]] చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. [[కార్తీక దీపం]] వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. [[హైదరాబాదు]] లోని మణికొండలో ఈయన స్మారకార్ధం ''డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి''కి ఈయన పేరుపెట్టారు.
 
==జీవిత సంగ్రహం==
ప్రభాకరరెడ్డి, [[నల్గొండ జిల్లా]], [[తుంగతుర్తి]]లో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు [[1935]], [[అక్టోబర్ 8]] న జన్మించాడు. తుంగతుర్తిలో[[తుంగతుర్తి (నల్గొండ జిల్లా మండలం)|తుంగతుర్తి]]<nowiki/>లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత [[హైదరాబాదు]]లోని సిటీ కాలేజీలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో [[గుత్తా రామినీడు]] దర్శకత్వం వహించిన [[చివరకు మిగిలేది]] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన [[పండంటి కాపురం]], [[పచ్చని సంసారం]], [[ధర్మాత్ముడు]], [[గృహప్రవేశం]], [[గాంధీ పుట్టిన దేశం]], [[కార్తీకదీపం]], [[నాకు స్వతంత్రం వచ్చింది]] వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
 
ప్రభాకరరెడ్డి [[1997]], [[నవంబరు 26]]<ref>[http://epaper.navatelangana.com/index.aspx?eid=31966&pg=023|. బహుముఖ ప్రతిభావంతుడు - హెచ్.రమేష్ బాబు - నవతెలంగాణ - సోపతి - 29-11-2015]</ref> తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించాడు.