కన్నెగంటి బ్రహ్మానందం: కూర్పుల మధ్య తేడాలు

Brahmi_2009.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (per c:Commons:Deletion requests/Files uploaded by Mkt1988~commonswiki).
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
==చదువు==
[[సత్తెనపల్లి]] శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో [[భీమవరం]] డి.ఎన్.ఆర్. కాలేజీలో [[ఇంటర్మీడియట్]], [[డిగ్రీ]] పూర్తి చేసాడు. [[గుంటూరు]] పీజీ సెంటర్లో [[తెలుగు]] [[సాహిత్యం|సాహిత్యంలో]] ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం [[అత్తిలి]]లో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా[[లెక్చరర్|లెక్చరర్‌]]<nowiki/>గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
 
==సినీరంగ ప్రవేశం==
 
ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా [[సినిమాలు]] చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. [[ఉమ్మడి కుటుంబం]]లో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనేమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తాడు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్.ఎస్.ఎల్.సి.లో గట్టిగానే పాసైనా, చిన్న తప్పులు చేసినా, తండ్రి నుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు ([[మిమిక్రీ]]) చేయడం, [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. [[అత్తిలి|అత్తిలిలో]] ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో [[దూరదర్శన్]]లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా, మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప, ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.
 
==తొలి సినిమా==