కైవారం బాలాంబ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కైవారం బాలాంబ''' (1849 - 1944) ప్రముఖ అన్నదాత.<ref>కైవారం బాలాంబ (1849-1944), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 385-6.</ref>
 
ఈమె [[1849]]లో [[గుంటూరు జిల్లా]], [[అంగలకుదురు]] గ్రామంలో జన్మించింది. సుబ్బన్నసూరి మరియు వెంకమాంబ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పుడే [[రామాయణం]], [[భాగవతం]] వంటి [[పురాణములు|పురాణ]] గ్రంథాల సారాన్ని గ్రహించారు. [[కైవారం సుబ్బన్న]] గారితో వివాహం జరిగి భర్తతో [[మంగళగిరి]] అత్తవారింటికి వచ్చారు. అనతికాలంలోనే భర్త మరణించారు. మంగళగిరి నరసింహస్వామిని ఉపాసించి దేవుని సేవలోనే శేషజీవితాన్ని గడిపారు. కొంతకాలం తపస్సు చేసి గ్రామంలో [[అన్నదానం]] ప్రారంభించారు. నిరాడంబరత, స్వపరభేదం లేని సమదృష్టి, ప్రశాంత చిత్తం వీరి వ్యక్తిత్వ లక్షణాలు. ఈమె మొదలుపెట్టిన [[అన్నదానం]] ప్రజల, దాతల ఆదరణకు నోచుకొని క్రమంగా విస్తృతమై వందలాది మంది భక్తులకు బాటసారులకు అన్నదానం చేసే స్థాయికి ఎదిగింది. [[మంగళగిరి]] తిరునాళ్ల సమయంలో వేలాది మంది యాత్రికులు వీరి సత్రంలో భోజనాలు చేసేవారు. 1926లో [[మంగళగిరి]] అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు.
 
ఈమె 95 సంవత్సరాల వయసులో [[1944]] [[ఆగష్టు 12]] తేదీన పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/కైవారం_బాలాంబ" నుండి వెలికితీశారు