జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా, పని చేశాడు → పనిచేశాడు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
==జీవన సంగ్రహం==
గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించాడు. బక్కపలచటి శరీరం, ఆలోచనాత్మకమైన చూపులు, సునిశిత మేధ ఆయన లక్షణాలు. [[తురుమెళ్ళ]], [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] హైస్కూళ్లలో పాఠశాల విద్య అభ్యసించాడు. ఏసి కాలేజి, [[గుంటూరు]] నుండి 1937లో పట్టభద్రులై, [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం]]<nowiki/>లో ఎం. ఏ. 1914లో పూర్తి చేశాడు. [[కాశీ]]<nowiki/>లో వుండగా మార్క్స్ సిద్ధాంతాల ప్రభావం ఆయనపై పడింది. [[మార్క్స్]] సిద్ధాంతాల జాడలో కావ్య జగత్తు అనే సాహిత్య గ్రంథం వ్రాశాడు.
 
కాలక్రమేణా [[ఎం.ఎన్.రాయ్]] ఉద్యమ ప్రభావానికి లోనయ్యాడు. విగ్రహవ్యావర్తిని అనే తాత్విక [[సంస్కృతము|సంస్కృత]] గ్రంథాన్ని తెలుగులోకి[[తెలుగు]]<nowiki/>లోకి అనువదించాడు. నాగార్జునాచార్యుని శూన్యవాదాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తల సరళిని కృష్ణారావు ఆకళింపు చేసుకొన్నాడు. ప్లేటో ఆదర్శ రాజ్యాన్ని [[సాహిత్య అకాడమీ|కేంద్ర సాహిత్య అకాడమీ]] వారికి తెలుగులోకి అనువదించాడు.
 
జేగంటలు, కీలుబొమ్మలు, వరూధిని శివరాత్రి, యుగసంధ్య ఈయన ఇతర రచనలు. బొమ్మ ఏడ్చింది, భిక్షా పాత్ర వంటి నాటికలు ఆదర్శ శిఖరాలు అనే పేరుతో సంపుటిగా వెలువరించాడు. [[కీలుబొమ్మలు (నవల)|కీలుబొమ్మలు]] నవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. పాపికొండలు, రాగరేఖలు, జఘన సుందరి వీరి నవలల్లో ప్రసిద్ధాలు. గ్రామీణ జన జీవనాన్ని అద్దంపట్టే కథలు చైత్రరథం పేరుతో సంపుటిగా వేశాడు. ఉదయబిందువులు యితర రచనల సంపుటి. నవ్యతోరణం వేదవ్యాస సంపుటి ప్రకటించాడు.
 
"Studies in Kalapoornodayam" అనే సిద్ధాంత గ్రంథాన్ని పరిశోధనకు సమర్పించి Ph.D. పట్టా [[మదరాసు విశ్వవిద్యాలయం]] నుండి పొందాడు. [[పింగళి సూరన]]పై యిది యిప్పటికీ అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. తత్వవేత్త అయిన కాంట్ పరతత్వ వాదాన్ని ఆయన సునిశితంగా పరిశీలించాడు.
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు