"మాధవపెద్ది సత్యం" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==జీవిత విశేషాలు==
సత్యం [[1922]], [[మార్చి 11]] న [[బాపట్ల]] సమీపాన [[బ్రాహ్మణ కోడూరు]] గ్రామములో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య మరియు సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి [[రంగస్థలం|రంగస్థల]] నాటకాలలో నటించేవాడు.
[[తెలుగు]] రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన [[ఆలూరు చక్రపాణి|చక్రపాణి]] సత్యాన్ని తనతోపాటు [[మద్రాసు]] తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న [[షావుకారు]] చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై [[హిందీ]], [[తమిళ]] ద్విభాషాచిత్రం [[రామదాసు]]లో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం [[షావుకారు]] సినిమాతో [[తెలుగు]] సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు ''అయ్యయో జేబులో డబ్బులు పోయెనే'' మరియు [[మాయాబజార్]] సినిమాలోని ''వివాహ భోజనంబు'' ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన [[సాలూరు రాజేశ్వరరావు]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] తదితరులందరితో పనిచేశాడు. సత్యం [[ఎస్వీ రంగారావు]] మరియు [[రేలంగి వెంకటరాయయ్య]] పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా [[పిఠాపురం నాగేశ్వరరావు]],మధవపెద్ది[[మాధవపెద్ది సత్యం]] జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలో ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.
 
75ఏళ్ల్ల వయసులో కూడా [[కృష్ణవంశీ]] తీసిన [[సింధూరం]] సినిమాలో ''సంకురాతిరి పండగొచ్చెరో'' పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.
1,85,775

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2077523" నుండి వెలికితీశారు