సిక్ఖు సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[image:Sikh Empire 1799-1849.svg|thumb|right|200px|Map of the Sikh Empire 1799-1849]]
[[File:The 'Court of Lahore'..jpg|thumb|సిక్ఖు సామ్రాజ్యంలో మహారాజా ప్రధాన దర్బారు, లాహోర్ దర్బారు.]]
'''సిక్ఖు సామ్రాజ్యం''' [[పంజాబ్ ప్రాంతం|పంజాబ్]], దాని సమీప ప్రాంతాలను కలుపుకుంటూ మతరహిత రాజ్యాన్ని స్థాపించిన [[రంజీత్ సింగ్|మహారాజా రంజీత్ సింగ్]] నాయకత్వంలో 19వ శతాబ్దిలో [[భారత ఉపఖండం]]లో ఏర్పడ్డ ప్రధాన రాజకీయ శక్తి.<ref>{{cite web|url=http://www.exoticindiaart.com/book/details/IDE822/ |title=Ranjit Singh: A Secular Sikh Sovereign by K.S. Duggal. '&#39;(Date:1989. ISBN 8170172446'&#39;) |publisher=Exoticindiaart.com |date=3 September 2015 |accessdate=2009-08-09}}</ref>. 1799లో రంజిత్ సింగ్ [[లాహోర్]] ను పట్టుకున్న నాటి నుంచీ 1849 వరకూ కొనసాగింది. స్వతంత్ర [[మిస్ల్]] లు, [[ఖల్సా]]లో సామ్రాజ్యపు పునాదులు పాదుకున్నాయి.<ref name="Encyclopædia Britannica Eleventh Edition 1911 Page 892">Encyclopædia Britannica Eleventh Edition, (Edition: Volume V22, Date: 1910–1911), Page 892.</ref><ref name="Grewal">{{cite book|last=Grewal|first=J. S.|title=The Sikhs of the Punjab, Chapter 6: The Sikh empire (1799–1849) |publisher=Cambridge University Press|year=1990|series=The New Cambridge History of India|work=|chapter=|url=https://books.google.com/books?id=2_nryFANsoYC&printsec=frontcover&dq=isbn%3D0521637643&hl=en&sa=X&ei=yKFPU_76KoaEO5blgYgH&ved=0CEwQ6AEwAQ#v=onepage&q=isbn%3D0521637643&f=false|isbn=0 521 63764 3 }}</ref> 19వ శతాబ్దిలో అత్యున్నత స్థితిలో ఉండగా సామ్రాజ్యం పడమట [[ఖైబర్ కనుమ]] నుంచి తూర్పున పశ్చిమ [[టిబెట్]] వరకూ, దక్షిణాన [[మిథన్ కోట్]] నుంచీ ఉత్తరాన [[కాశ్మీర్]] వరకూ విస్తరించింది. [[సిక్ఖు]] సామ్రాజ్యం [[బ్రిటీష్]] వారు [[భారత ఉపఖండం]]లో ఆక్రమించిన ఆఖరి ప్రధానమైన భాగం.
 
సిక్ఖు సామ్రాజ్యపు పునాదులు 1707లో [[ఔరంగజేబు]] మరణం, [[ముఘల్ సామ్రాజ్యం|ముఘల్ సామ్రాజ్య]] [[ముఘల్ సామ్రాజ్య పతనం|పతనం]] నుంచి చూడవచ్చు. గురు గోవింద్ సింగ్ ప్రారంభించిన ఖల్సా మరో రూపమైన దాల్ ఖల్సా ఒకవైపు ముఘల్ సామ్రాజ్యం చెప్పుకోదగ్గ విధంగా బలహీన పడిపోవడంతో పశ్చిమాన [[పష్తూన్|ఆఫ్ఘాన్ల]]పై దండయాత్రలతో పోరాటం సాగించారు. ఆ క్రమంలో ఈ సైన్యాలు విస్తరించి, విడిపోయి వివిధ సమాఖ్యలు, పాక్షికంగా స్వతంత్రత కలిగిన మిస్ల్ ల స్థాపన సాగింది. వివిధ ప్రాంతాలు, నగరాలను ఈ సైన్య విభాగాలు నియంత్రించడం ప్రారంభించాయి. ఏదేమైనా 1762 నుంచి 1799 వరకూ మిస్ల్ ల సైన్యాధ్యక్షులు స్వతంత్ర సైనిక నాయకులుగా రూపాంతరం చెందారు.
 
లాహోరును రంజీత్ సింగ్ ఆఫ్ఘాన్ పరిపాలకుడు [[జమాన్ షా అబ్దాలీ]] నుంచి గెలుచుకుని, [[ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధం|ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధాల్లో]] ఆఫ్ఘాన్లను ఓడించి బయటకు పంపేయడం, వివిధ సిక్ఖు మిస్ల్ ను ఏకీకరణ చేయడంతో సామ్రాజ్య స్థాపన జరిగింది. 12 ఏప్రిల్ 1801న [[వైశాఖి]] పండుగ నాడు [[పంజాబ్]] మహారాజాగా ప్రకటించుకుని, ఏకీకృతమైన రాజ్యంగా ప్రకటించారు. గురు నానక్ వంశస్తులైన సాహఙబ్ సింగ్ బేడీ పట్టాభిషేకం జరిపించారు.<ref>[http://www.learnpunjabi.org/eos/ The Encyclopaedia of Sikhism], section ''Sāhib Siṅgh Bedī, Bābā (1756–1834)''.</ref>
 
ఒక మిస్ల్ కు నాయకుని స్థానం నుంచి పంజాబ్ మహారాజా అయ్యేంతవరకూ రంజిత్ సింగ్ అతికొద్ది కాలంలోనే అధికారం సంపాదించారు. అప్పటికి ఆధునికమైన ఆయుధాలు, యుద్ధ పరికరాలు, [[శిక్షణ]] సమకూర్చి సైన్యాన్ని ఆధునీకరించారు. సిక్ఖు సామ్రాజ్య కాలంలో సిక్ఖులు కళారంగంలోనూ, విద్యాల్లోనూ పునరుజ్జీవనం పొందారు. రంజిత్ సింగ్ మరణానంతరం అంతర్గత కుమ్ములాటల్లోనూ, రాజకీయమైన తప్పులతోనూ సామ్రాజ్యం బలహీనపడింది. చిరవకు 1849లో ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో ఓటమి అనంతరం సామ్రాజ్యం పతనమైంది. సిక్ఖు సామ్రాజ్యం 1799 నుంచి 1849 కాలంలో [[లాహోర్]], [[ముల్తాన్]], [[పెషావర్]], [[కాశ్మీర్]] ప్రావిన్సులుగా ఉండేది.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సిక్ఖు_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు