కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
చి (వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
==సినీరంగ ప్రవేశము==
తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే తొలి అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో 'బెఖుడి'లో నటించే అవకాశాన్ని సంపాదించింది. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా [[సినిమా]] పూర్తి చేసింది. అయితే ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అయినా... కాజోల్ నటన, అందం చూసి అప్పటికే '[[బాజీగర్]]' సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాజీగర్' వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో [[బాలీవుడ్]] దృష్టిలో పడింది. చదువులు పూర్తి కాకమునుపే స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టిపెట్టింది.
 
1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన '[[సీతారామయ్యగారి మనవరాలు]]'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. [[అక్షయ్‌కుమార్]], [[సైఫ్ అలీఖాన్]] సరసన నటించింది. 1995లో 'కరణ్ అర్జున్', '[[దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే']] చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.
 
==వ్యక్తిగత జీవితము==
'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. 1994లో మొదలైన ప్రేమాయణం 1999దాకా కొనసాగింది. 24 ఫిబ్రవరి 1999న [[మహారాష్ట్ర]] సంప్రదాయం ప్రకారం అజయ్ దేవగణ్ ఇంట్లో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. అజయ్ దేవగణ్, కాజోల్ జోడీ గురించి అప్పట్లో రకరకాల చర్చలు సాగాయి. ఇద్దరిదీ సరైన జోడీ కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాజోల్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో పెళ్ళి చేసుకోవడం పట్ల కూడా విమర్శలొచ్చాయి. అయితే ఇద్దరూ వాటిని బేఖాతరు చేశారు. ఓ ఇంటివారై కలిసి నడిచారు. ఆ జంటకి ఇద్దరు పిల్లలున్నారు. నైసా అనే అమ్మాయితో పాటు, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు.
==సామాజిక సేవ==
పెళ్ళి తర్వాత ఎక్కువగా అతిథి పాత్రల్లో కనిపిస్తున్న కాజోల్... సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛందే సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆ విషయంలో కాజోల్‌కి కర్మవీర్ పురస్కారం లభించింది.
1,95,674

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2078830" నుండి వెలికితీశారు