"గుడివాడ" కూర్పుల మధ్య తేడాలు

1,056 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.
===శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2014,[[నవంబరు]]-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. [4]
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017,మార్చ్-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు , శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. []
 
===శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2016,[[ఫిబ్రవరి]]-18వ తేదీ [[గురువారం]]నాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. [13]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079861" నుండి వెలికితీశారు