"గొల్లపల్లి (నూజివీడు)" కూర్పుల మధ్య తేడాలు

#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు, 2015,[[మార్చ్]]-28వ తేదీ [[శనివారం]] నుండి ఏప్రిల్-5వ తేదీ ఆదివారం వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించెదరు. 28వ తేదీన స్వామివారిని పెళ్ళికుమారుని చేయుట, 30వ తేదీనాడు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, 31వ తేదీనాడు మంగళవాయిద్యాలతో తీర్ధపు బిందె, ధ్వజారోహణ, ఏప్రిల్-1వ తేదీనాడు నిత్యహోమం, సంక్లేపరామాయణ పారాయణం, ఛావమౌళి భజన, రాత్రికి గజవాహనపై ఎదుర్కోలు ఉత్సవం, రఘునాథస్వామివారి కళ్యాణోతసవం, అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహించెదరు. దీనికి ముందు అన్నసమారాధన నిర్వహించెదరు. ఏప్రిల్-3వ తేదీనాడు రథోత్సవం, 4వ తేదీనాడు గరుడ వాహనంపై గ్రామోత్సవం, 5వ తేదీనాడు స్వామివారికి పవళింపుసేవతో కార్యక్రమాలు పరిసమాప్తమవుతవి. [8]
#ఈ ఆలయానికి వేంపాడు గ్రామంలో 3,356 ఎకరాల మాన్యం భూమి ఉంది. గొల్లపల్లి గ్రామంలో 52.77 ఎకరాల మాన్యం భూమి ఉంది. వీటిలో మొత్తం సాగుభూమి 2,798 ఎకరాలు. కానీ స్వామివారికి వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. [4]
====శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం====
#ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,[[నవంబర్]]-9, [[ఆదివారం]] నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [6]
#ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు. [7]
 
====శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం====
#ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,నవంబర్-9, ఆదివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [6]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079882" నుండి వెలికితీశారు