విశ్వనాథ సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇతరములు: చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''విశ్వనాథ సత్యనారాయణ'''([[ఆంగ్లం]]: '''Viswanatha Satyanarayana''') ([[సెప్టెంబర్ 10]], [[1895]] - [[అక్టోబరు 18]], [[1976]]) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. [[తెలుగు]] సాహిత్యంలో తొలి [[జ్ఞానపీఠ అవార్డు]] గ్రహీత.
 
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు[[సాహిత్యము]]<nowiki/>నకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, [[కథలు]], చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "''నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును'' " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును <ref name="తె.పె.">తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు</ref>.
 
విశ్వనాథ ''మాట్లాడే వెన్నెముక'' అని [[శ్రీశ్రీ]] వర్ణించారు. [[జి.వి. సుబ్రహ్మణ్యం]] ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన [[కవిత్వం]] వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో[[కృతి]]<nowiki/>లో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో[[వాక్కు]]<nowiki/>లో, వాక్యంలో[[వాక్యం]]<nowiki/>లో, శబ్దంలో[[శబ్దం]]<nowiki/>లో, సమాసంలో[[సమాసం]]<nowiki/>లో, భావంలో, భావనలో[[భావనరుషి|భావన]]<nowiki/>లో, దర్శనంలో[[దర్శనం]]<nowiki/>లో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో[[భూషణం]]<nowiki/>లో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. [[మహాకవి]]గా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం."<ref name="dn">'''తెలుగు సాహిత్య చరిత్ర''' - రచన: డాక్టర్ ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ: ప్రతిభ పబ్లికేషస్స్, హైదరాబాదు (2004)</ref>
 
[[File:Viswanatha satyanarayana statue.jpg|right|300px|thumb|విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం, లెనిన్ సెంటర్, [[విజయవాడ]]]]
పంక్తి 48:
[[File:Name plate at Viswanatha Satyanarayana's home.JPG|thumb|right|300px|<center>విశ్వనాధ సత్యనారాయణ ఇంట్లో పేరు ఫలకం</center>]]
[[File:Name plate at Viswanatha Satyanarayana's home, nearer view.JPG|thumb|right|300px|<center>విశ్వనాధ సత్యనారాయణ వారి ఇంటి పేరు ఫలకం యొక్క దగ్గరగా దృశ్యం</center>]]
విశ్వనాథ [[1895]], [[సెప్టెంబరు 10]]న ([[మన్మథ]] నామ సంవత్సర [[భాద్రపద బహుళ షష్ఠి]])<ref name="వేయి">"వేయి పడగలు" పుస్తకానికి గ్రంథకర్త కుమారులు పావనిశాస్త్రి పీఠిక</ref> ) [[కృష్ణా జిల్లా]] [[నందమూరు]] గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. ఆయనది తెలుగు వైదిక [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబం. శోభనాద్రి జీవితం చాలా వరకూ వైభవోపేతంగా సాగిన చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన మాటల్లో చెప్పాల్సి వస్తే మరీ చిన్నతనంలో ''నేను యువరాజును[[యువరాజు]]<nowiki/>ను. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ.''<ref name="విశ్వనాథలోని నేను">{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|date=సెప్టెంబరు, 1982|publisher=విశ్వనాథ స్మారక సమితి|location=హైదరాబాదు|accessdate=13 November 2014}}</ref> అనంతర కాలంలో శోభనాద్రి కేవలం అంగవస్త్రము, పంచె మాత్రమే సర్వవస్త్రాలుగా మిగిలాకా కూడా దానాలిచ్చి ''దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన'' స్థితిలో జీవించాల్సి వచ్చింది.<ref name="విశ్వనాథలోని నేను" />. తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు, ఆయన [[వారణాసి]] వెళ్ళి గంగానదిలో[[గంగానది]]<nowiki/>లో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వరస్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరులో[[నందమూరు]]<nowiki/>లో ప్రతిష్ఠించి ఆలయం కట్టించారు. ఆయన ప్రభావం తమపై విపరీతంగా వుందని విశ్వనాథ సత్యనారాయణ అనేకమార్లు చెప్పుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు తండ్రి నుంచి వచ్చినవేనని చెప్పుకున్నారు
<ref group='నోట్'>అతని ఆస్తిక్యమింతని యనఁగఁ గలదె<br />
లేదనిన యూహ గలుగని సాదునకును<br />
పంక్తి 55:
 
=== విద్యాభ్యాసం ===
విశ్వనాథ సత్యనారాయణ విద్యభ్యాసము ఎన్నో ఆటంకాల నడుమ సాగింది. ప్రాథమిక విద్యను [[నందమూరు]], [[ఇందుపల్లి]], మరియు [[పెదపాడు]] గ్రామాల్లో అభ్యసించారు. పై చదువు [[బందరు]] పట్టణంలో సాగింది. [[మచిలీపట్నం|బందరు]] హైస్కూలులో [[చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి|చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]] తెలుగు ఉపాధ్యాయునిగా లభించారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి, పండితుడు. ఆయన వద్ద బందరు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్న వారు అనంతర కాలంలో మహా పండితులుగా, మహాకవులుగా ఆంధ్రదేశంలో సుప్రఖ్యాతి పొందడం విశేషం. వారిలో విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యులు. చెళ్ళపిళ్ళ తమకు నిత్యం పాఠ్యప్రణాళిక ప్రకారం, సమయానికి వచ్చి పాఠాలు చెప్పినవారు కారనీ, ఐతే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ శాఖాచంక్రమణంలో ఎన్నెన్నో [[భాషా శాస్త్రం|భాషా]], [[సాహిత్యం|సాహిత్య]] విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిదిద్దారని విశ్వనాథ వ్రాశారు.<ref name="ఆత్మకథ">{{cite book|last1=సత్యనారాయణ|first1=విశ్వనాథ|title=ఆత్మకథ|publisher=శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్|accessdate=13 November 2014}}</ref> <ref group='నోట్'>విశ్వనాథ సత్యనారాయణ ఆత్మకథలోనే కాక అనేకానేక పద్యాలలో తన గురువు చెళ్ళపిళ్ళ గురించి ఎన్నో విశేషాలు వెల్లడించారు. ముఖ్యంగా తన జీవిత సాఫల్యంగా భావించిన రామాయణ కల్పవృక్షం కావ్యం యొక్క అవతారికలోని ''తిరుపతి వేంకటేశ్వరులు..'', ''తన యెద యెల్ల మెత్తన...'', ''శిష్యవాత్సల్యంబు చెలువు తీర్చిన మూర్తి''వంటి ప్రఖ్యాత పద్యాలతో పాటుగా తనవంటి గొప్ప రసావతార మూర్తి శిష్యుడైనాడన్న భోగము నన్నయకూ, తిక్కనకూ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రికి దక్కినట్టుగా దక్కలేదన్న పద్యం ''అల నన్నయకు లేదు..''కూడా వుంది.</ref> విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొనేందుకు కళాశాలను వదిలివేశారు. తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తున్నా ఆయన ఈ సాహసం చేశారు. 1921 నుంచి 1926 వరకూ బందరులోని [[ఆంధ్ర జాతీయ కళాశాలలోకళాశాల, మచిలీపట్నం|ఆంధ్ర జాతీయ కళాశాల]]<nowiki/>లో అధ్యాపకునిగా పనిచేశారు. మధ్యలో వదిలివేసిన బి.ఎ.ను తిరిగి 1926-27లో పూర్తిచేసి, బందరు [[హిందూ కళాశాల, బందరు|హిందూ కళాశాల]]లో అధ్యాపకునిగా చేరారు.<ref name="విశ్వనాథ జీవితగాథా వ్యాసం" />
=== ఉద్యోగ జీవితం ===
ప్రధానంగా ఆయన అధ్యాపక వృత్తిలో జీవితాన్ని గడిపారు. విద్యార్థి దశలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం, తండ్రి మరణంతో దారుణమైన [[పేదరికం]] వంటి కారణాల వల్ల ఆయన బి.ఎ. పూర్తికాకుండానే ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. అనంతరం ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు. బందరు నేషనల్ కాలేజి (1928), [[గుంటూరు]] [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి]] (ఏసీ కాలేజీ) (1932లో స్వల్పకాలం) పనిచేశారు. అనంతరం దాదాపుగా ఐదారేళ్ళ పాటుగా స్థిరమైన [[ఉద్యోగం]] లేకుండా రచన, ప్రసంగాదుల ద్వారా జీవించారు. కఠోరమైన ఆర్థిక దుస్థితిని ఎదుర్కొన్నా ఈ కాలంలో కవిగా ఆయన విఖ్యాతులయ్యారు. [[విజయవాడ]]లో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాలగా మార్పు చెందింది), [[కరీంనగర్]] ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేసారు. [[1957]]లో విశ్వనాథ [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] ఉపాధ్యక్షులుగానూ, [[1958]]లో [[శాసనమండలి]]కి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు.
 
=== దాంపత్యం ===
విశ్వనాథ సత్యనారాయణ మొదటి భార్య పేరు వరలక్ష్మి. ఆమె అపురూపమైన వ్యక్తిత్వం కల మహా మనీషిగా విశ్వనాథ తరచు పేర్కొన్నారు. వరలక్ష్మి సాహచర్యం తనకు వరమని, ఆమె వల్లనే తానొక కవిని కాగలిగానని పలు విధాలుగా అనేకమైన రచనల్లో పేర్కొన్నారు. ఆమె వాగ్మాధుర్యం, [[సౌందర్యం]], పాతివ్రత్యం, సంసారాన్ని దిద్దుకున్న తీరు వంటివి అతిలోకమైన లక్షణాలుగా వివరించారు. తాను స్వయంగా వట్టి నీరసబుద్ధి గలవాడనని, తాను గొప్ప రసవేత్తను, రసస్రష్టను కావడానికి, మహాకవిని కావడానికి మూలం ఆమేనని పద్యరూపంగా పేర్కొన్నారు.<ref group='నోట్'>''<poem>వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
.......ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి</poem>''
పంక్తి 68:
=== భార్యా వియోగం ===
''ప్రధాన వ్యాసం:[[వరలక్ష్మీ త్రిశతి]]''<br />
1931-32 కాలంలో ఆయన మొదటి భార్య, తనను రసవేత్తగా మలిచిన వ్యక్తి వరలక్ష్మి అనారోగ్యంతో మరణించారు. ఆ వియోగదు:ఖం విశ్వనాథ జీవితంపై, ఆలోచనలపై తీవ్రమైన ముద్రవేసింది. ఆయన జీవితంలో గొప్ప కుదుపు తీసుకువచ్చింది. తన జీవిన సరస్వం వంటి ఆమె మరణం వల్ల ఆయనలో కలిగిన వేదన తన చరమాంకంలోనూ పోలేదు. ఆయన 36 ఏట తొలి భార్య మరణించగా తన 80వ ఏట మరణించే సమయంలోనూ ఆమెనే తలచుకున్నారని సన్నిహితులు, కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వరలక్ష్మి మరణం పొందాకా ఆ వియోగబాధలో రోజుల తరబడి వెలువడ్డ పద్యాలను కూర్చి 20 ఏళ్ళ అనంతరం [[వరలక్ష్మీ త్రిశతి]]గా ప్రచురించారు. 300 పద్యాలున్న ఈ గ్రంథంలో వరలక్ష్మి మరణం, కర్మకాండలు మొదలుకొని స్మృతిగా మిగిలి వేదన మిగల్చడం వరకూ అనేక సందర్భాల్లో వచ్చిన పద్యాలు ఉంటాయి. తెలుగు సాహిత్యంలో[[సాహిత్యం]]<nowiki/>లో నిలిచే నవలగా విమర్శకులు భావించిన విశ్వనాథ [[వేయిపడగలు]]లో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజజీవితంలో విశ్వనాథ సత్యనారాయణదనీ, ధర్మారావు భార్య అరుంధతి వరలక్ష్మమ్మ అని పేర్కొంటారు. ఆమె మహోన్నత్యం, సహజ పాండిత్యం, [[అనారోగ్యం]], [[మరణం]] వంటివన్నీ ఆ నవలలోనూ వర్ణితమయ్యాయి. ఆయన మహాకావ్యం [[రామాయణ కల్పవృక్షం]]తో కూడా వరలక్ష్మి మరణానికి గాఢమైన సంబంధముంది. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను [[రామకథను వినరయ్యా|రామకథ]]<nowiki/>ను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.<ref name="విశ్వనాథలోని నేను" /> ఆయన జీవితంపై, సాహిత్యంపై అలా వరలక్ష్మితో దాంపత్యమూ, ఆమె అకాల మరణమూ తీవ్రమైన ప్రభావం చూపించాయి.
 
=== కష్టదశ (1932-38) ===
పంక్తి 80:
1916 లో "విశ్వేశ్వర శతకము"తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించాడు. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. [[రేడియో]] కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు.
[[1961]]లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించారు.
 
ప్రముఖ బెంగాలీకవి[[బంగ్లా భాష|బెంగాలీ]]<nowiki/>కవి [[రవీంద్రనాధ టాగూరు]] వలె తన రచనలను కొన్నింటినైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే, ఆయన అంతర్జాతీయ ఖ్యాతినార్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాథ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం <ref name="తె.పె."/>
===పాత్ర చిత్రణ===
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాథ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, [[స్వయంకృషి|స్వయం]] ప్రకాశవంతమయిన పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
 
===ముఖ్య రచనలు===
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, [[వేయిపడగలు]], కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, [[విశ్వనాథ మధ్యాక్కఱలు]], [[నన్నయ్య|నన్నయ]] ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.
 
తన రచనలలో [[రామాయణ కల్పవృక్షం|శ్రీమద్రామాయణ కల్పవృక్షం]] (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నారు. తమిళనాడులోని[[తమిళనాడు]]<nowiki/>లోని [[మదురై]] ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] మళయాళంలోనికి, [[అంబటిపూటి హనుమయ్య]] తమిళంలోనికి అనువదించారు. [[ఏకవీర]] సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు [[సి.నారాయణరెడ్డి]] మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి [[పి.వి.నరసింహారావు]] "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించారు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, [[కిన్నెరసాని]] పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
 
[[విశ్వనాథ సత్యనారాయణ]] వారి ముఖ్య రచనా సాహిత్యంలో శతకములు ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి, వీటి గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే. <br>