కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి.
వ్లాదిమిర్ లెనిన్, మావో జెడాంగ్, ఫిడెల్ కాస్ట్రో, సాల్వడార్ అలెండె, జోసిప్ బ్రొజ్ టిటో, క్వామె క్రుమా సహా ఎందరో 20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రపంచ నాయకులు మార్క్స్ తమపై గాఢ ప్రభావం చూపాడని పేర్కొన్నారు.
== ప్రారంభ జీవితం ==
కార్ల్ మార్క్స్ [[జర్మనీ]] లోని ట్రీర్ అనే పట్టణంలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. మార్క్స్ బాన్, [[బెర్లిన్]] మరియు జెనా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు.[[1842]]లో మార్క్స్ ఒక పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. పత్రికా యాజమాన్యంతో వచ్చిన విభేదాలతో [[1843]]లో మార్క్స్ సంపాదకత్వ బాధ్యతలనుండి తప్పుకుని [[పారిస్]] చేరుకున్నాడు. అక్కడ [[చరిత్ర]], [[రాజనీతి శాస్త్రం]] మరియు [[తత్వశాస్త్రము|తత్వశాస్త్రాలను]] అభ్యసించటంతో మార్క్స్ లో [[సామ్యవాదం|సామ్యవాద]] భావాలు రూపుదిద్దుకున్నాయి. మార్క్స్ [[1844]]లో [[ఎంగెల్స్]]ను పారిస్ లో మొదటిసారి కలిసాడు. భావ సారూప్యత కలిగిన వారిద్దరూ శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సైద్దాంతిక సూత్రాలను ఆవిష్కరించటానికి మరియు ఆ సూత్రాల ప్రకారంగా అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టటానికి కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.వారి స్నేహం మార్క్స్ జీవించి ఉన్నంతవరకు అలానే కొనసాగింది.
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు