కార్ల్ మార్క్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
మార్క్స్ ప్రకారం, రాజ్యాల ప్రజలందరి సాధారణ ఆసక్తులకు అనుగుణంగా నడుస్తున్నట్టుగా చూపించుకున్నా, నిజానికి పాలకవర్గం ఆసక్తులకు అనుగుణంగా నడుస్తాయి. <ref>". గత పాలక వర్గం స్థానంలో వచ్చే ప్రతి కొత్త వర్గం, కేవలం తన లక్ష్యాలను సాధించుకోవడానికి గాను, తప్పనిసరి పరిస్థితిలో తన ఆసక్తులు సమాజంలోని ప్రజలందరి సామాన్య ఆసక్తిగా చేసేందుకు ఉత్తమ సాధనంగా తన ఆలోచనలకు విశ్వజనీనమన్న రూపాన్ని ఇవ్వాల్సివుంటుంది, అలానే అవి మాత్రమే హేతుబద్ధమైనవనీ, విశ్వజనీనమైనవనీ చూపాల్సివుంటుంది." చూడండి: https://www.marxists.org/archive/marx/works/1845/german-ideology/ch01b.htm</ref> గత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లాగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు స్వయం వినాశనానికి దారితీసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఐన సామ్యవాదం ఏర్పడుతుందని ఊహించారు. మార్క్స్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలోని వర్గ వైరుధ్యాలు దాని అస్థిరతకు, సంక్షోభానికి గురయ్యే లక్షణానికి కొంత కారణమై క్రమంగా కార్మిక వర్గం వర్గ చైతన్యాన్ని సాధించడానికి దారితీస్తుంది, ఇది వారు రాజకీయ ఆధిపత్యాన్ని సాధించేందుకు, చివరకు ఉత్పత్తిదారుల స్వేచ్ఛా సంఘటితంగా ఏర్పడే ప్రభుత్వం ద్వారా వర్గ రహిత, కమ్యూనిస్టు సమాజం స్థాపనకు దారితీస్తుంది.<ref>Karl Marx: [http://www.marxists.org/archive/marx/works/1875/gotha/index.htm ''Critique of the Gotha Program''] (Marx/Engels Selected Works, Volume Three, pp. 13–30;)</ref><ref>In [http://www.marxists.org/archive/marx/works/1852/letters/52_03_05.htm Letter from Karl Marx to Joseph Weydemeyer] (''MECW'' Volume 39, p. 58; )</ref> మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువచ్చేందుకు సంఘటిత విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారు.<ref name="Calhoun2002-23-24" />
 
మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు, ఆయన కృషి, సిద్ధాంతం అటు ప్రశంసలు, ఇటు విమర్శలు కూడా విస్తృతంగా పొందింది.<ref name="Manchester"/> ఆర్థిక శాస్త్రంలో ఆయన కృషి శ్రమ గురించి, దానికీ పెట్టుబడికీ ఉన్న సంబంధం గురించి ప్రస్తుత అవగాహనకీ, తత్ సంబంధితమైన ఆర్థిక ఆలోచనకీ చాలావరకూ పునాదిగా నిలుస్తోంది.<ref>[[Roberto Mangabeira Unger]]. ''Free Trade Reimagined: The World Division of Labor and the Method of Economics''. Princeton: Princeton University Press, 2007.</ref><ref>John Hicks, "Capital Controversies: Ancient and Modern." ''The American Economic Review'' 64.2 (May 1974) p. 307: "The greatest economists, Smith or Marx or Keynes, have changed the course of history..."</ref><ref>[[Joseph Schumpeter]] Ten Great Economists: From Marx to Keynes. Volume 26 of Unwin University books. Edition 4, Taylor & Francis Group, 1952 ISBN 0415110785, 9780415110785</ref> ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, కార్మిక సంఘాలు, కళాకారులు, రాజకీయ పార్టీలు మార్క్స్ ఆలోచనాధార, తాత్త్వికత, కృషిలకు ప్రభావితం అయ్యాయి, చాలామంది ఆయన ఆలోచనను స్వీకరించడమో, మార్పుచేసుకోవడమో చేశారు. మార్క్స్ ని సామాన్యంగా ఆధునిక సామాజికశాస్త్ర నిర్మాతల్లో ఒకరిగా పేర్కొంటారు.<ref name="plato.stanford.edu"/>{{cite web |url=http://plato.stanford.edu/entries/weber/|title=Max Weber – Stanford Encyclopaedia of Philosophy}}</ref>
 
మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కార్ల్_మార్క్స్" నుండి వెలికితీశారు