గంగారత్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో [[1893]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలము, [[గంగలకుర్రు]] గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే ఈమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. ఈమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె భర్త మరణించాడు. ఫలితంగా ఈమె జీవనోపాధి కోసం 17 సంవత్సరాల పిన్నవయసులోనే నాటకాలలో వేషం వేయడం ప్రారంభించింది. 1936లో సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తొంభై సంవత్సరాల వయసు వరకు నటజీవితాన్ని కొనసాగించింది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె చివరి దశలో పేదరికాన్ని అనుభవిస్తూ 2001లో తన 108వ యేట మరణించింది.
==నాటకరంగం==
జీవనోపాధి కోసం అతి పిన్నవయసులోనే నాటకాలు వేయడం ప్రారంభించిన గంగారత్నం ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకంలో కలహకంఠిగా, చింతామణి నాటకంలో శ్రీహరిగా పాత్రలు ధరించింది. చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర పోషించాలంటే ఒక్క గంగారత్నమే దానికి సమర్థురాలనే పేరు గడించింది. విద్యుత్ దీపాలు లేని ఆ రోజుల్లో, దివిటీల వెలుగులో దీపాల కాంతిలో నాటక ప్రదర్శనలు నిర్వహించే రోజులలో కూడా ఈమె అధ్భుతంగా నటించి పేరు సంపాదించుకుంది. ఆ రోజుల్లో రంగస్థలంపై ఉద్దండులైన [[యడవల్లి సూర్యనారాయణ]], [[గోవిందరాజుల సుబ్బారావు]], [[స్థానం నరసింహారావు]], [[ఉప్పులూరి సంజీవరావు]], [[నెల్లూరు నాగరాజు]] మొదలైనవారితో నటించింది. ఈమె 1936- 1985 మధ్యకాలంలో సినిమాలలో నటించింది. సినిమాలలో నటించడం మానివేసిన తరువాత మళ్ళీ నాటకరంగంలో పునఃప్రవేశం చేసి సుమారు 20 సంవత్సరాలు అనేక పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/గంగారత్నం" నుండి వెలికితీశారు