గంగారత్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
==నాటకరంగం==
జీవనోపాధి కోసం అతి పిన్నవయసులోనే నాటకాలు వేయడం ప్రారంభించిన గంగారత్నం ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకంలో కలహకంఠిగా, చింతామణి నాటకంలో శ్రీహరిగా పాత్రలు ధరించింది. చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర పోషించాలంటే ఒక్క గంగారత్నమే దానికి సమర్థురాలనే పేరు గడించింది. విద్యుత్ దీపాలు లేని ఆ రోజుల్లో, దివిటీల వెలుగులో దీపాల కాంతిలో నాటక ప్రదర్శనలు నిర్వహించే రోజులలో కూడా ఈమె అధ్భుతంగా నటించి పేరు సంపాదించుకుంది. ఆ రోజుల్లో రంగస్థలంపై ఉద్దండులైన [[యడవల్లి సూర్యనారాయణ]], [[గోవిందరాజుల సుబ్బారావు]], [[స్థానం నరసింహారావు]], [[ఉప్పులూరి సంజీవరావు]], నెల్లూరు నాగరాజు మొదలైనవారితో నటించింది. ఈమె 1936- 1985 మధ్యకాలంలో సినిమాలలో నటించింది. సినిమాలలో నటించడం మానివేసిన తరువాత మళ్ళీ నాటకరంగంలో పునఃప్రవేశం చేసి సుమారు 20 సంవత్సరాలు అనేక పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించింది.
==సినిమా రంగం==
ఈమె క్రమంగా నాటకాల నుండి చలనచిత్ర రంగంలోనికి ప్రవేశించింది. కాకినాడకు చెందిన కొమ్మారెడ్డి నాగేశ్వరరావు 1936లో నిర్మించిన ప్రేమవిజయం అనే సాంఘిక చలనచిత్రంలో తొలిసారిగా నటించింది. తరువాత ఈమె అనేక ప్రఖ్యాత చలన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ఈమె నటించిన చివరి చిత్రం [[శ్రీవారి శోభనం]]. ఈమె గయ్యాళి పాత్రలను అతి సహజంగా పోషించి మంచి పేరు సంపాదించుకున్నది. ఈమె గయ్యాళి పాత్రలు తరువాతి తరం నటి [[సూర్యకాంతం|సూర్యకాంతానికి]] ఆదర్శ ప్రాయం అయ్యాయి.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/గంగారత్నం" నుండి వెలికితీశారు