ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
[[ఫైలు:Ugadi pachadi and ingredients.jpg|right|thumb|200px|ఉగాది పచ్చడి]]
ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా[[నైవేద్యం]]<nowiki/>గా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.
 
పండుగ తయారి:ఒక వారం ముందే పండుగ పనులు మొదలవుతాయి. ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహం, పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు. పచ్చటి మామిడి తోరణాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కథ ఉంది. శివపుత్రులు [[గణపతి]], సుబ్రమణ్యస్వాములకు [[మామిడి]] పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కథ.
 
ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి, రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలని కోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు.
ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. [[పులిహోర]], [[బొబ్బట్లు]], [[పాయసం]], అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం.
పంచాంగ శ్రవణం:
 
పంక్తి 32:
కవి సమ్మేళనం:
 
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, [[రాజకీయం]], వాణిజ్యంఇలా[[వాణిజ్యం]]<nowiki/>ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, [[కవులు]] తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఊరగాయల కాలం:
 
మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "[[ఆవకాయ]]". “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”
సర్వేజనా సుఖినోభవంతు
'''ఉగాది''', తెలుగువారు జరుపుకునే [[పండుగ]] లలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే [[తెలుగు]] సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు వారు నూతన సంవత్సరం జరుపుకుంటారు.  ఉగాది రోజున క్రొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటు స్నానం చేసి, క్రొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవాలయములకు[[దేవాలయము]]<nowiki/>లకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.
 
ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు ''గుడి పడ్వాగా'' నూ, తమిళులు ''పుత్తాండు'' అనే పేరుతో, మలయాళీలు ''విషు'' అనే పేరుతోను, సిక్కులు ''వైశాఖీ'' గానూ, బెంగాలీలు ''పొయ్‌లా బైశాఖ్'' గానూ జరుపుకుంటారు.
 
==ఉగాదినిర్ణయం==
"ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. [[బ్రహ్మ దేవుడు]] ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు. దీనికి ఆధారం వేదాలను ఆధారం చేసుకొని వ్రాయబడిన "[[సూర్య సిద్ధాంతం]]" అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం
<poem>
"'చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
పంక్తి 53:
[[చైత్ర శుద్ధ పాడ్యమి]] రోజున [[బ్రహ్మ]] సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. [[మత్స్యావతారము]] ధరించిన [[విష్ణువు]] సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు [[వసంత ఋతువు]] కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. [[శాలివాహనుడు]] పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ.
 
"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ [[పాడ్యమి]] నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.<ref name="td">[http://www.happyfriendshipday5.com/2016/04/happy-ugadi-2016-video-greetings.html ఉగాది -తెలుగుదనం వెబ్ సైటు] </ref>.
 
==ఉగాది సాంప్రదాయాలు==
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు