పి.ఎస్.నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డూ. → డు., లొ → లో, → using AWB
పంక్తి 1:
'''పి.ఎస్.నారాయణ''' ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
'''పి.ఎస్.నారాయణ'''గా పిలువబడే పొత్తూరి సత్యనారాయణ 1938లో [[గుంటూరు జిల్లా]], [[మంగళగిరి]] మండలం, [[చినకాకాని]]లో పొత్తూరి రామయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని బాల్యంలోనే[[బాల్యం]]<nowiki/>లోనే తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద అక్కయ్య వద్ద పెరిగి పెద్ద అయ్యాడు. ఇతడు ప్రాథమిక విద్య [[చినకాకాని]]లోను, సెకెండ్ ఫారం వరకు [[మంగళగిరి]]లోను, థర్డ్ ఫారం నుండి బి.కాం వరకు [[గుంటూరు]]లోని [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో చదివాడు. కాలేజీ చదివే సమయంలో [[మన్నవ గిరిధరరావు]] ఇతని గురువు<ref name="పి.ఎస్.నారాయణ">{{cite book|last1=దండు|first1=మల్లేష్|title=పి.ఎస్.నారాయణ జీవితం, రచనలు ఒక పరిశీలన|date=1 July 2013|pages=2-4|url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/22266/7/07_chapter_1.pdf|accessdate=31 January 2017}}</ref>.
 
==ఉద్యోగం, కుటుంబం==
ఇతడు 1957లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట రెవెన్యూ శాఖలో గుమాస్తాగా తాత్కాలికంగా పనిలోకి చేరాడు. తరువాత అదే గుమాస్తాగా వైద్య శాఖలోనికి మారాడు. అక్కడ రెండేళ్లు పనిచేసి [[గుంటూరు జిల్లా]] ట్రెజరీలో గుమాస్తాగా పర్మనెంటు ఉద్యోగంలో చేరాడు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. 1963లో హైదరాబాదులోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్‌లో జూనియ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ సుమారు 30 సంవత్సరాలు పనిచేసి 1993లో సీనియర్ అకౌంట్స్ ఎక్జిక్యూటివ్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు<ref name="పి.ఎస్.నారాయణ" />. ఇతడు బి.కాం. చదువుతుండగా ఇతనికి తన అక్క కూతురు మాధురి అన్నపుర్ణతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగారు.
 
==రచనాప్రస్థానం==
ఇతని తొలిరచన 1957లో గుంటూరు పత్రికలో అచ్చయింది. ఇతడు తొలినాళ్ళలో మాధురి అనే కలంపేరుతోను, అనేక ఇతర కలం పేర్లతోను రచనలు చేసేవాడు. ఇతడిని ఇతని గురువు [[మన్నవ గిరిధరరావు]] చాలా ప్రోత్సహించాడు. ప్రముఖ రచయితలు [[తారక రామారావు]], [[కాకాని చక్రపాణి]], [[శ్రీ సుభా]], కవిరాజు, [[పాలకోడేటి సత్యనారాయణరావు]], దత్తప్రసాద్ పరమాత్ముని, [[దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి|డి. చంద్రశేఖరరెడ్డి]], గోవిందరాజు చక్రధర్, [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] మొదలైనవారు ఇతని సమకాలికులు మరియు సన్నిహితులు. ఇతని రచనలు స్వాతి, నవ్య, ఇండియాటుడే, [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ]], [[జ్యోతి]], అప్సర, [[యువ (పత్రిక)|యువ]], [[రచన (మాస పత్రిక)|రచన]] తదితర దిన, వార, పక్ష, మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి.
===కథలు===
ఇతడు 230కి పైగా కథలు వ్రాసి వివిధ పత్రికలలో ప్రకటించాడు. స్వప్నం దాల్చిన అమృతం అనే కథా సంపుటాన్ని వెలువరించాడు. [[కథానిలయం]]లో లభ్యమయ్యే ఇతని కథల జాబితా<ref>[http://kathanilayam.com/writer/857 రచయిత: పి ఎస్ నారాయణ]</ref>:
"https://te.wikipedia.org/wiki/పి.ఎస్.నారాయణ" నుండి వెలికితీశారు