రోనాల్డ్ కోస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఆర్థిక వ్యవస్థ నిర్దిష్ట వివరణలతో రోనాల్డ్ కోస్ ఎంతో దోహదంచేశారు. సంప్రదాయిక సూక్ష్మ అర్థ శాస్ర సిద్ధాంతం అసంపూర్ణంగా ఉందని నిరూపించారు. ఈ సిద్ధాతంలో ఉత్పత్తి, రవాణా వ్యయాన్ని మాత్రమే చేర్చుతున్నారని, కాంట్రాక్టుల వ్యయాన్ని, నిర్వహణ వ్యయాన్ని చేర్చడం లేదని రోనాల్డ్ కోస్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థ ఉపయోగించే మొత్తం వనరులలో ఈ వ్యయం వాటా గణనీయంగా ఉటుందని రోనాల్డ్ కోస్ నిరూపించినాడు.
==ఆస్తి హక్కుల సిద్ధాంతం==
ఆస్తి హక్కుల సిద్ధాంతాన్ని రూపొందించడంలో రోనాల్డ్ కోస్ ఆద్యుడు. ఆస్తి హకుల వివాదానికి సంబంధించిన సామాజిక వ్యయ సమస్య పత్రాన్ని ప్రచురించిన అనంతరం రోనాల్డ్ కోస్ చాలా ప్రసిద్ధి చెందారు.ఆయన రూపొందించిన ఆస్తి హక్కుల సిద్ధాంతానికి [[జార్జి స్టిగ్నర్]] '''కోస్ సిద్ధాంతం''' అని పేరు పెట్టినాడు. ఫ్యాక్తరీ వదులుతున్న విష కాలుష్యం కారణంగా వాతావరణం కలుషితమై చుట్టుప్రక్కల ఉన్న ఇండ్ల విలువ పడిపోతుంది. అటువంటి సందర్భాలలో ఫ్యాక్టరీ యజమానిపై చర్యలు తీసుకోవాలని [[సంప్రదాయిక ఆర్థిక వేత్తలు]] భావిచేవారు. కాని ఆస్తి హక్కులు స్పష్టంగా నిర్దేశిమ్చాలనినిర్దేశించాలని, కాలుష్యం స్థాయిని మార్కెట్ నిర్థారించాలని రోనాల్డ్ కోస్ వాదించాడు.
==ఆర్థశాస్త్రానికి రోనాల్డ్ కోస్ కృషి==
ఆర్థిక శాస్త్రము ప్రయోజన కరంగా ఉండాలని భావించిన ఆర్థికవేత్తలలో రోనాల్డ్ కోస్ ఒకరు. ఆయన చాలా సరళమైన భాషలో తన రచనలు కొనసాగించాడు. సంప్రదాయిక ఆర్థిక వేత్తల సిద్ధాంతాన్ని కాదని తన పరిశోధనలతో మెరుగైన భావనలను ఉద్ఘాటించాడు. ముఖ్యంగా తాను ప్రవచించిన ఆస్తి హక్కుల సిద్ధాతం, వర్తక వ్యవహారాల వ్యయ సిద్ధాంతం అర్థ శాస్త్రంలోనే ఒక నూతన అద్యయనానికి తెరదీసింది.
"https://te.wikipedia.org/wiki/రోనాల్డ్_కోస్" నుండి వెలికితీశారు