మధుబాల (రోజా ఫేమ్‌): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
|website =
}}
'''మధుబాల''' ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె [[హిందీ భాష|హిందీ]], [[తమిళ భాష|తమిళ]],[[తెలుగు]], [[మలయాళ భాష|మలయాళ]] భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు [[కె.బాలచందర్]] సలహాతో '''మధుబాల'''గా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా [[మణిరత్నం]] దర్శకత్వంలో వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]]. ఈ [[సినిమా]] దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.
==విశేషాలు==
ఈమె ప్రముఖ హిందీ నటి [[హేమా మాలిని]]కి మేనకోడలు.ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె [[తల్లి]] వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది.ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్ పట్టాలమ్‌(ഒറ്റയാൾ പട്ടാളം) అనే మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే [[కె.బాలచందర్]] దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో [[అజయ్ దేవగణ్]] తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఈమె [[గుజరాతీ భాష|గుజరాతీ]] వ్యాపారి ''ఆనంద్ షా''ను [[వివాహం]] చేసుకుని అమెరికాలో[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో నివసించింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/మధుబాల_(రోజా_ఫేమ్‌)" నుండి వెలికితీశారు