శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఎర్నగూడెం దగ్గర [[దేవరపల్లి]]లో వెంకట సోమయాజులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి.
==పండితయశస్వి==
[['ఆంధ్రప్రదేశ్]] తొలి ఆస్థానకవి శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కి గండపెండేరం సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు జరిగాయి. ఎన్నో బిరుదులూ వున్నాయి. ఆ బిరుదులన్నీ సార్ధక బిరుదులే. శతాధిక గ్రంధాలను రాసిన శ్రీపాదవారు కృతి కర్తె కాదు. కృతి భర్త కూడా. ప్రజ్ఞా వంతుడు. ప్రతిభావంతుడు. యశస్వి. శ్రీపాదవారి తర్వాత అంతటి కీర్తిప్రతిష్టలు పొందినవాళ్ళు చాలా అరుదుగా వున్నారని చెప్పవచ్చు. అసలు హర్షుడు రాసిన నైషధీయ చరితాన్ని, శ్రీనాధుడు రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని సంకల్పించడమే ఓ సాహసం. అయితే ఎక్కడా కూడా మూల గ్రంధాల సహజత్వం పోకుండా చూసారు. అద్భుతంగా నైషద చరితాన్ని అందించిన ఘనత శ్రీపాద వారికే చెల్లిందని చెప్పవచ్చు. ఇక శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు [[ఆంధ్రాయూనివర్సిటీ]]కి ఇచ్చేశారు. అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించగా, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో వెతుకుతున్నారు.
 
==పదబంధ నేర్పరి శ్రీపాద వారు==
గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం'వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి,విజాతి,విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ,మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంధాలను రాసారు. పద్యం,గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం,వేదం,శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు.ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది.
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2083913" నుండి వెలికితీశారు