గన్నవరం (యద్దనపూడి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ఈ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీ [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], 1989లో గ్రూప్-2 పరీక్షలద్వారా, రాష్ట్రప్రభుత్వ సర్వీసులో తహసీలుదారుగా నియమితులైనారు. వివిధ ప్రాంతాలలో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి వీరు ప్రస్తుతం [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]]లో ఆర్.డి.వో.గా పనిచేస్తున్నారు. వీరు [[తెలుగు]] భాషా ప్రేమికులు - పరిరక్షకులు, కవి, రచయిత. వీరు మట్టిమనుషుల జీవితాలను తన రచనలలో ప్రతిబింబించారు. కర్షకుల కష్టాలను, పల్లె జీవితాన్నీ ప్రత్యక్షంగా అనుభవించడంతో, సహజంగానే తన కవితలు, నానీలకు అవే ఇతివృత్తాలయ్యాయని వీరు చెబుతారు. సుప్రసిద్ధ కవులు, విమర్శకులు వీరి రచనలను శ్లాఘించడం విశేషం. సాహితీ స్రష్టగా ఎన్నో సత్కారలు, పురస్కారాలు ఆయనను వరించినవి. వీరు వృత్తిలో గూడా నిబద్ధతతో పనిచేయుచూ, ప్రజాసేవ చేస్తున్నారు. వీరు చేసిన ప్రజాసేవకు గుర్తుగా రాష్ట్ర గవర్నరుగారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ స్వర్ణపతకం అందుకున్నారు. ఆర్.డి.వోగా పల్లె ప్రాంతాలలో ప్రజల కష్టాలు, కన్నీళ్ళు తనను కదిలించి, భావావేశాలను రగిలించినవని ఆయన పలు సందర్భాలలో సాహితీ వేదికలపై చెప్పేవారు. వీరు తండ్రి [[సోమేపల్లి]] పేరిట, [[సోమేపల్లి సాహితీ పురస్కారం]] ని ప్రతి ఏటా అందజేయుచూ వర్ధమాన రచయితలను ప్రోత్సహించుచున్నారు.<ref>http://epaper.sakshi.com/c/12737434</ref><ref>http://www.prajasakti.com/index.php?srv=10301&id=1241372</ref>
 
==గ్రామ విశేషాలు==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఈ చిన్న గ్రామాభివృద్ధికై ఏకంగా రు. 1.16 కోట్లను మంజూరు చేసారు.
"https://te.wikipedia.org/wiki/గన్నవరం_(యద్దనపూడి)" నుండి వెలికితీశారు