సి. సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
ఈమె చెన్నపురి ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన మోహినీ రుక్మాంగద నాటకంలో ధర్మాంగద పాత్రను ఏడేళ్ల వయసులో అభినయించి ప్రేక్షకుల మెప్పును పొందింది. అప్పటి నుండి రంగూన్ రౌడీ, తులాభారం, చింతామణి మొదలైన నాటకాలలో ప్రదాన పాత్రలను పోషించింది. కలికాలం, పాపం పండింది, బికారి రాముడు మొదలైన నాటకాలలో నటించింది.
===రక్తకన్నీరు===
1958లో ఆవిర్భవించిన రక్తకన్నీరు నాటకం ఈమె జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. తమిళంలో [[ఎం.ఆర్.రాధా]] విరివిగా ప్రదర్శించిన ఈ నాటకాన్ని [[పాలగుమ్మి పద్మరాజు]] తెలుగులోనికి అనువదించాడు. నాగభూషణం దీనిని రంగస్థలంపై రసవద్ఘట్టంగా తీర్చిదిద్దాడు. రక్తకన్నీరు నాటకంలో సుందరి పాత్రను ఈమె నటించేది. ఇది వాంప్ తరహా పాత్ర. హీరో నాగభూషణం భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరతాడు. ఇందిర పాత్రను [[వాణిశ్రీ]], [[శారద (నటి)|శారద]] చాలాకాలం వీరి ట్రూపుతో కలిసి నటించారు. ఈమె వాణిశ్రీకి డైలాగులు పలకడంలో, వేషధారణ, ఆంగికాభినయంలో శిక్షణ ఇచ్చింది. రక్తకన్నీరు నాటకం విజయవంతం కావడానికి నాగభూషణం సతీమణిగా, నాటక సమాజం నిర్మాతగా ఈమె పాత్ర అదృశ్యమే అయినా ప్రముఖమైనది. రక్తకన్నీరు ప్రదర్శించబడిన 20 సంవత్సరాలు కూతురు భువనేశ్వరి పుట్టినప్పుడు రెండు నెలలు మినహాయిస్తే మిగిలిన అన్నిరోజులు ఈమె ఆ నాటకంలో ఇందిర పాత్రను పోషించింది. వెనుక వుండి నిర్వహణ పనులను అంకితభావంతో చూసుకున్నది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సి._సీత_(నటి)" నుండి వెలికితీశారు