సి. సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సి. సీత''' ప్రముఖ సినిమానటుడు [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] సతీమణి. ఈమె సుమారు 3 దశాబ్దాలు సినిమాలు, నాటకాలలో నటించింది.
==జీవిత విశేషాలు==
ఈమె [[1935]]లో సినిమా నటుడు, వస్తాదు, నిర్మాత, దర్శకుడు అయిన [[రాజా శాండో]], మూకీ,టాకీల తొలితరం సినిమా నటి లీలాబాయిలకు జన్మించింది.<ref>{{cite news|last1=పి.వి.|first1=రామ్మోహన్‌నాయుడు|title=రక్తకన్నీరు వెనక కథానాయిక|url=http://eprints.cscsarchive.org:8080/jspui/bitstream/2015/1122/2/10CB6B1C9713865465257DFE0023A304_01.pdf|accessdate=28 March 2017|work=వార్త|date=5 May 2002}}</ref>. ఈమె పూర్వీకుల స్వస్థలం [[తూర్పుగోదావరి జిల్లా]], [[కాకినాడ]]. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడం వల్ల ఈమెకు చిన్నతనం నుండి సినిమా పరిశ్రమ, నటన పట్ల అవగాహన ఏర్పడింది. ఈమె శేషాద్రి అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకుంది. మంచి కంఠస్వరం, గ్రహణశక్తి ఈమెను మంచి గాయనిగా తీర్చిదిద్దింది. ఈమె [[వెంపటి చినసత్యం]] వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందింది. ఈమెకు నాలుగేళ్ల చిన్నవయసులోనే ముఖానికి రంగువేసుకుని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత అనేక సినిమాలలో, నాటకాలలో నటించింది. ఈమెకు 1956లో ప్రముఖ నటుడు [[నాగభూషణం (నటుడు)|సి.నాగభూషణం]]తో వివాహం జరిగింది.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/సి._సీత_(నటి)" నుండి వెలికితీశారు