జాతర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), హైదరాబాద్ → హైదరాబాదు, నిషేది → నిష using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|ఒక భారతీయ సాంప్రదాయము|అదే పేరుగల సినిమా|జాతర (సినిమా)}}
[[హిందూ]] సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి [[పండగ]] చేయడాన్ని [[జాతర]] అంటారు. '''జాతర'''ని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క [[గ్రామ దేవతలు|గ్రామదేవత]] ఉన్న మన భారతదేశములో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.
 
==కొన్ని ముఖ్యమైన జాతరలు==
పంక్తి 9:
* [[మేడారం]] [[సమ్మక్క సారక్క జాతర]]
* [[తిరుపతి]] [[గంగమ్మ జాతర]]లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
* [[పైడితల్లి జాతర]]: [[విజయనగరం]] రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. [[బొబ్బిలి యుద్ధం]] సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను [[పైడితల్లి]] వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి [[1757]]లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి [[విజయ దశమి]] ముగిసిన తొలి [[మంగళవారం]] రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో [[సిరిమాను]] ఎక్కడ ఉందో [[పైడితల్లి]] అమ్మవారే స్వయంగా [[పూజారి]] కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
* [[లింగమంతుల స్వామి జాతర]]: పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. [[నల్లగొండ]] జిల్లా [[సూర్యాపేట]] సమీపంలో దురాజ్‌పల్లిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది. [[హైదరాబాదు]]-[[విజయవాడ]] బస్సులను జాతర అయిదు రోజులూ [[నార్కట్‌పల్లి]], [[నల్లగొండ]], [[మిర్యాలగూడ]], [[కోదాడ]] మీదుగా మళ్లిస్తారు.
* [[నాగోబా జాతర]]: అదిలాబాద్ జిల్లాలో జరిగే [[గోండు]]ల జాతర.
* [[శ్రీకాళహస్తి]]లో జరిగే [[శ్రీకాళహస్తి#పండుగలు|ఏడుగంగల జాతర]]
పంక్తి 23:
—గుఱ్ఱము జాషువా గబ్బిలం
==[[జీవహింస]] ==
*జీవాలను బలిస్తామని[[బలి]]<nowiki/>స్తామని మొక్కుకున్నవారి నుంచి ఆ జీవాలను అందుకున్న పోతురాజు మేక మెడను వెనక్కి విరిచి తన నోటితో ఆ మెడను పట్టి అమాంతంగా కొరికేస్తాడు. గింజుకుంటున్న ఆ మేకను గాలిలోకి విసిరి నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తాడు.కొన్ని జాతరల్లో కాళ్ళతో చచ్చే వరకు మూగజీవాన్ని తొక్కి చంపడం ఒక భాగం. ఒక్కో కులం నుంచి ఒక ప్రతినిధి ముందుకు వచ్చి జాతర ప్రారంభ దినాన ఇలా [[మేక]]నో, [[గొర్రె]]నో తొక్కి చంపేస్తాడు. అనంతరం దాన్ని వండుకొని తింటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఎత్తైన శిడిమానుకు మూగజీవాలను కట్టడం ఒక ఆచారంగా ఉంది. ఈ జీవానికి పొడవాటి చువ్వలు గుచ్చి [[సిడిమాను]]కు వేలాడదీస్తారు. మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి అవి బతికితే ఇక వాటి జోలికి వెళ్ళరు.
 
==ఎన్నెన్నో నమ్మకాలు==
*[[శిడిమాను]]కు వేలాడదీసిన మూగజీవి మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి బతికితే ఇక దాని జోలికి వెళ్ళరు. అది మేసిన చేలల్లో సిరులు పండుతాయని ఒక నమ్మకం.
*బియ్యం కొలత వేసి గ్రామదేవత గుడిలో[[గుడి]]<nowiki/>లో పెడితే మరుసటి రోజు అవి పెరుగుతాయని కొన్ని గ్రామాల్లో విశ్వసిస్తారు.
*బంగారంతో చేసిన ఏదో ఒక వస్తువును ఆ గ్రామంలోని పుట్టలో వేసి మరుసటి రోజు తవ్వి తీస్తారు. తిరిగి దొరికిన ఆ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించి పూజలు జరుపుతారు.
*ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేధించినా జాతరల్లో [[మాతంగి]] నాట్యమాడాల్సిందే. మాతంగి లేకుండా ఏ జాతరా ప్రారంభం కాదు.
*ఒక్క వేటుతో [[దున్నపోతు]]ను తెగనరికి ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని గ్రామ పొలిమేరల్లో విసరడం పలు గ్రామాల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఈ సమయంలో పొరుగూరు వాసులు ఎవరూ ఈ గ్రామంలో అడుగుపెట్టకుండా [[కర్రలు]], బరిసెలతో కాపలాకాస్తుంటారు.
*గ్రామాధిపత్యం కోసం పోట్లాడుకునే వర్గాలకు ఈ జాతరలు కలిసొస్తుంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/జాతర" నుండి వెలికితీశారు