స్త్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
మూడేండ్ల బాలికను త్య్రబ్ద అని అందురు. యువతికి ఎలనాగ, కాహళి, కొమరు, చామచిరంటి, జవరాలు, జవ్వని, తరుణి, ధని, పడుచు అనీ; వృద్ధురాలుకు జరతి, ఏలిక్ని, మందాకిని, ముదుసలి, ముద్ది, వృద్ధ, అవ్వ వంటి పదాలున్నాయి. ఒక బిడ్డను మాత్రమే కన్న స్త్రీని కదళీవంధ్య అనీ; ఇద్దరు బిడ్డలు మాత్రమే కన్న స్త్రీని కాకవంధ్య అనీ ఒకప్పుడు అనేవారు.
దూషిత, హత అంటే కన్యాత్వము చెడినది అనీ; భర్త, పిల్లలు గతించిన స్త్రీని నిర్వీర అనీ; మారుమనువాడిన స్త్రీని పునర్భువు అనీ; పిల్లలు కలగని స్త్రీని గొడ్రాలు, అప్రజాత, అశశ్వి, గొడ్డురాలు, బందకి, వంజ, వంధ్య, వృషలి, శూన్య అనీ; గర్భవతియైన స్త్రీని అంతరాపత్య, అంతర్గర్భ, ఉదరిణి, గర్భిణి, చూలాలు, దౌహృదిని, నిండు మనిషి, భ్రూణ, సనత్త్వ, సూష్యతి, వ్రేకటిమనిషి అని పేర్కొనడం వుంది. అలాగే బాలెంతరాలు అయిన స్త్రీని జాతాపత్య, నవప్రసూత, పురుటాలు, పురుటియాలు, ప్రజాత, ప్రసూత, ప్రసూతిక, బాలెంత, బిడ్డతల్లి, సూతక, సూతి అని పేర్కొంటారు. ఇలా స్త్రీకి వివిధ దశల్లో కూడా పేర్కొనబడే అర్థసూచక పదాలు అనేకం ఉన్నాయి.<ref>[http://www.worldofwarshipsmod.com/ womens] at homeoclinic.</ref> ఆత్రేయి, ఉదక్య, ఏకవస్త్ర, త్రిరాత్ర, నెలబాల, స్త్రీ ధర్మిణి అంటూ ఋతుమతి అయిన స్త్రీకి పర్యాయపదాలున్నాయి.
 
== సమాజంలో స్త్రీల పాత్ర ==
"https://te.wikipedia.org/wiki/స్త్రీ" నుండి వెలికితీశారు