పుష్పవల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==విశేషాలు==
ఈమె [[తాడేపల్లిగూడెం]] దగ్గరలో ఉన్న [[పెంటపాడు]] గ్రామంలో [[1926]], [[జనవరి 3]]వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు వెంకట పుష్పవల్లి తాయారు. ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి సంపూర్ణరామాయణం సినిమాలో[[సినిమా]]<nowiki/>లో [[సీత]] వేషం వేసింది. తరువాత [[దశావతారములు (1962 సినిమా)|దశావతారములు]] సినిమాలో మోహిని పాత్ర ధరించింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశం లభించింది. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు]], [[హిందీ భాష|హిందీ]] సినిమాలలో విరివిగా నటించింది. ఈమె చెల్లెలు [[సూర్యప్రభ]] కూడా సినిమా నటిగా రాణించింది. ఆమె [[వేదాంతం రాఘవయ్య]]ను వివాహం చేసుకుంది. పుష్పవల్లి [[జెమినీ గణేశన్]] ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే జెమినీ గణేశన్‌కు పెళ్లి అయింది. ఈమె కూడా ఈ పెళ్లికి ముందు రంగాచారిని వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్ళి మూడునాళ్ల ముచ్చట అయ్యింది. జెమినీ గణేశన్‌కు ఈమెకు బాబ్జీ, భానురేఖ, రమ, రాధ, ధనలక్ష్మి అనే సంతానం కలిగారు. వీరిలో భానురేఖ [[రేఖ]] పేరుతో హిందీ సినిమా రంగంలో ఒక తారగా వెలుగునొందింది.
పుష్పవల్లి జెమినీ గణేశన్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఈమె [[1992]] [[మే 11]]న మరణించింది.
 
"https://te.wikipedia.org/wiki/పుష్పవల్లి" నుండి వెలికితీశారు