ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==ఆత్రేయ పాటలు గురించి==
'[[దీక్ష (1951 సినిమా)|దీక్ష]]' (1950) చిత్రానికి తొలిసారి ఆయన పాటలు రాశారు. "పోరా బాబు పో.." అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన '[[సంసారం (1950 సినిమా)|సంసారం]]' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. '[[అర్ధాంగి (1955 సినిమా)|అర్థాంగి]]' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', '[[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడి కోడళ్ళు]]' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి...', '[[శ్రీ వెంకటేశ్వర మహత్యం|శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]]'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా...', '[[మంచి మనసులు (1962 సినిమా)|మంచి మనసులు]]'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు...', '[[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]]' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో...' '[[డాక్టర్ చక్రవర్తి|డాక్టర్‌ చక్రవర్తి]]'లో 'నీవులేక వీణ ...', '[[అంతస్తులు]]'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము...', '[[ప్రేమనగర్|ప్రేమ్‌నగర్‌]]'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...', '[[మరో చరిత్ర|మరోచరిత్ర]]'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో...', '[[ఇంద్రధనుస్సు (1978 సినిమా)|ఇంద్రధనస్సు]]'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి...', '[[అంతులేని కథ]]'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు...', '[[మరో చరిత్ర|మరోచరిత్ర]]'లో 'విధి చేయు వింతలన్నీ...', '[[ఇది కథ కాదు]]'లో 'సరిగమలు గలగలలు...', '[[స్వాతిముత్యం]]'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య...' తోపాటు '[[తేనె మనసులు (1965 సినిమా)|తేనే మనసులు]]', '[[ప్రైవేటు మాస్టారు|ప్రైవేట్‌ మాస్టర్‌]]', '[[బ్రహ్మచారి (సినిమా)|బ్రహ్మాచారి]]', '[[మట్టిలో మాణిక్యం]]', '[[బడిపంతులు (1972 సినిమా)|బడి పంతులు]]', '[[పాపం పసివాడు]]', '[[భక్త తుకారాం|భక్త తుకారం]]', '[[బాబు (1975 సినిమా)|బాబు]]', '[[జ్యోతి (1976 సినిమా)|జ్యోతి]]', 'అందమైన అనుబంధం', '[[గుప్పెడు మనసు]]', '[[ఆకలి రాజ్యం]]', '[[అభిలాష (సినిమా)|అభిలాష]]', '[[కోకిలమ్మ]]', '[[అభినందన (సినిమా)|అభినందన]]', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు.<ref>[http://10tv.in/Telugu-poet-scenarist-lyricist-Atreya-Acharya-44387 మనసు కవి 'ఆత్రేయ'...]</ref>
 
==ఆత్రేయ గురించి==
పంక్తి 52:
*తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత ఆయనను ''బూత్రేయ'' అనీ అన్నారు.
*ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "చోళ" అందుకే "[[పల్లవి]]" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.
* తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]] సినిమాలో ఈ రెండు పాటలు "'''ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు'''," "'''నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు'''." అలాగే [[ప్రేమనగర్]] సినిమాలో "'''నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది'''." పాట, మరియు "'''తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా'''" పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.
*మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు<br> ఏ తీగ పువ్వునో...ఏ కొమ్మ తేటినో...<br>పదహారేల్లకు...నీలో నాలో<br>బలే బలే మగాడివోయ్ ...నీ అన నీ దానినోయ్...అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి.
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[శారద]]లు నటించిన "[[ఇంద్రధనుస్సు]]" సినిమాలోని పాట "'''నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి'''" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఆయనే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు