అభిమన్యుడు: కూర్పుల మధ్య తేడాలు

మరికొన్ని లింకులు
చి అక్షరదోష సవరణ
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|అర్జునుని కుమారుడు}}
'''అభిమన్యుడు''' పాండురాజు కుమారుడు [[పాండవులు|పాండవ]] మధ్యముడు అయిన [[అర్జునుడు|అర్జునినిఅర్జునుని]]కి బలరామకృష్ణుల సహోదరి అయిన [[సుభద్ర]]కు ప్రియజన్మించిన పుత్రుడు. పాండవుల వనవాసకాలములో తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, [[ఉత్తర]]ను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.
 
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో [[భీష్ముడు|భీష్ముని]]చే రచించబడిన [[పద్మవ్యూహము]]లో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన [[దుర్యోధనుడు|దుర్యోదన]], [[దుశ్శాసనుడు|దుశ్శాసన]], [[కర్ణుడు|కర్ణాదు]]లచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ [[మహాభారతము|భారతము]]లో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునినిఅర్జునునికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని [[కృష్ణుడు|కృష్ణుని]] నిలదీస్తుంది. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను [[అశ్వద్ధామ]] సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త, [[సైంధవుడు]], అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరవాత అర్జునుని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని, ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతినచేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవుని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/అభిమన్యుడు" నుండి వెలికితీశారు