త్రిజట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం, ఉన్నది. → ఉంది. (2), ) → ) (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Trijatha solo.jpg|thumb|right|200px|త్రిజట]]
'''త్రిజట''', [[రామాయణం]]లో ఒక వృద్ధ రాక్షస స్త్రీ పాత్ర. రావణుడు [[సీత]]ను ఎత్తుకొని పోయి లంకలో బంధించి, ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఈమె ఒకరు. ఈమెకు [[శ్రీరాముడు]] సముద్రము దాటివచ్చినట్లు, [[రావణుడు]] యుద్ధంలో చనిపోయినట్లు [[కల]] వస్తుంది. [[సుందర కాండ]]లో త్రిజట స్వప్న వృత్తాంతం గురించి ఉంది. త్రిజట [[విభీషణుడు|విభీషణుని]] కూతురు అని అంటారు గాని ఇది సరి కాదని [[గుంటూరు శేషేంద్ర శర్మ]] వ్రాశాడు. గోవిందరాజీయములో "త్రిజటా విభీషణ పుత్రీ" అన్న పదాలను తప్పుగా విడదీయడం వలన ఈ అర్థం వచ్చిందని అతని భావన. (త్రిజట, మరియు విభీషణుని కూతురు అని ఇద్దరిని సూచించే వాక్యంగా ఈ శ్లోక భాగాన్ని అర్థం చేసుకోవాలి - అని రచయిత భావం). విభీషణుని కూతురు పేరు "నల". త్రిజట వృద్ధురాలైన వనిత గనుక విభీషణుని కూతురు కానేరదు. వాల్మీకి రచనలో "త్రిజటా వృద్ధా ప్రబుద్ధా వాక్యమబ్రవీత్" అని ఉంది.<ref name="shodasi">[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితఙయన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000</ref>
 
"https://te.wikipedia.org/wiki/త్రిజట" నుండి వెలికితీశారు