వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
'''యెర్రగుడిపాటి వరదరావు''' ('''వై.వి.రావు''') ([[మే 30]], [[1903]] - [[ఫిబ్రవరి 14]], [[1973]])<ref>{{cite web |title= Y. V. Rao profile |url= http://kannadamoviesinfo.wordpress.com/y-v-rao/ |publisher= ''kannadamoviesinfo.com'' |accessdate= 31 March 2014}}</ref> తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.<ref name=autogenerated2>[http://www.hindu.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title -->]</ref>
==జీవిత విశేషాలు==
వై.వి.రావు [[1903]] [[మే 30]]న [[నెల్లూరు]]లో జన్మించాడు. [[మద్రాసు]] విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. బొంబాయిలో[[బొంబాయి]]<nowiki/>లో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని[[చెన్నై|మద్రాసు]]<nowiki/>లోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]]లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన [[చింతామణి పిక్చర్స్]]ను స్థాపించాడు. [[1950]]లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన [[ముంబై|బొంబాయి]], [[కొల్హాపూర్]], [[మద్రాసు]] మరియు [[మైసూరు]]లలో పనిచేశాడు. తొలి [[కన్నడ భాష|కన్నడ]] టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు [[ఆర్.నాగేంద్రరావు]] నటించిన ''[[సతీ సులోచన]]'' ఈయనే నిర్మించాడు.
 
[[1946]]లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు [[తమిళ]] సినిమా నటీమణి అయిన కుమారి [[వై.రుక్మిణి|రుక్మిణి]]ని వివాహమాడినాడు. [[తెలుగు]] సినీనటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] (''జీన్స్'' చిత్రములో బామ్మ) ఈయన కూతురే.<ref name=autogenerated1>[http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title -->]</ref>
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు