రోజారమణి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
'''రోజారమణి''' [[తెలుగు సినిమా]] నటి. [[భక్త ప్రహ్లాద]]లో [[బేబి రోజారమణి]]గా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో[[సినిమా]]<nowiki/>లో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970 మరియు 1980 వ దశకాల్లో [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళం]], [[కన్నడ భాష|కన్నడ]] సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. [[మాస్టర్ తరుణ్]] అనే పేరుతో బాలనటుడిగా చక్కగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన [[తరుణ్]] రోజారమణి కొడుకు.
 
==జీవిత విశేషాలు==
రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు.<ref>http://www.rediff.com/movies/2000/dec/07ramani.htm</ref>
ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం [[ఈటీవీ]] ఒడియా చానల్ లో దర్శకుడు మరియు నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు [[తరుణ్ కుమార్|తరుణ్]]. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్.
 
==కెరీర్==
ఆమె 5 సంవత్సరాల వయసులో [[భక్త ప్రహ్లాద]] సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే ''చంబరతి'' అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా [[కన్నె వయసు]] అనే సినిమా గా, తమిళంలో ''పరువ కాలం''గా పునర్నిర్మించారు.
 
తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు [[హిందీ భాష|హిందీ]], [[ఒడియా భాష|ఒడియా]] భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో [[సుహాసిని]], [[మీనా]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[రమ్యకృష్ణ]], [[రోజా సెల్వమణి|రోజా]], [[విజయశాంతి]], [[శిల్పా శెట్టి|శిల్పాశెట్టి]], [[దివ్యభారతి]], [[నగ్మా]], [[కుష్బూ]] లాంటి నటీమణులకు గాత్రదానం చేసింది.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/రోజారమణి" నుండి వెలికితీశారు