"సుమలత" కూర్పుల మధ్య తేడాలు

171 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
| website =
}}
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]] మరియు [[హిందీ భాష|హిందీ]] చిత్రాలలో నటించింది.
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, [[ముంబై|బొంబాయి]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]] మరియు [[హిందీ]] చిత్రాలలో కూడా నటించింది.
తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, [[బాపు]] దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.
 
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]]ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన [[కన్నడ భాష|కన్నడ]] సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
 
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము [[బాస్]]లో ఈమె ఒక పాత్ర పోషించింది. [[గేమ్]] సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.
1,91,156

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2092764" నుండి వెలికితీశారు