రాజ్యలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
'''రాజ్యలక్ష్మి''' తెలుగు సినిమా నటీమణి. ఈమె [[శంకరాభరణం]] సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.
==నేపధ్యము==
[[గుంటూరు జిల్లా]] తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు [[కె. విశ్వనాధ్]] గారు [[శంకరాభరణం]] సినిమా లో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు [[చెన్నై]] వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక [[తమిళ భాష|తమిళం]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళం]] మరియు [[హిందీ భాష|హిందీ]] సినిమాలలో నటించింది. నాయిక గా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో [[నెలవంక]], [[చెవిలో పువ్వు]], [[జస్టిస్ చౌదరి]], [[అభినందన]], [[వివాహభోజనంబు]], [[అభిలాష]], [[పసివాడి ప్రాణం]] మరియు [[జననీ జన్మభూమి]] చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి.
==వివాహము==
ఒక వేడుకలో పరిచయమైన [[చెన్నై]] కు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత [[సింగపూర్]] వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి [[చెన్నై]] వచ్చారు. తర్వాత పలు చిత్రాలు మరియు [[టెలివిజన్]] ధారావాహికలలో నటించడం కొనసాగించింది.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/రాజ్యలక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు