వై. విజయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| homepage =
}}
'''ఎనిగండ్ల విజయ''' అలియాస్ '''వై.విజయ''' [[తెలుగు సినిమా]] నటి మరియు నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన [[తల్లిదండ్రులు (1970 సినిమా)|తల్లితండ్రులు]]. [[ఎన్టీఆర్‌|ఎన్టీఆర్]] సరసన శ్రీకృష్ణ సత్య అనే సినిమాలో [[కథానాయిక]]గా నటించింది. [[శోభన్‌బాబు]] సరసన కూడా కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000 కి పైగా చిత్రాలలో నటించింది.
==బాల్యం==
ఈమె తండ్రి ఎనిగండ్ల జ్ఞానయ్య, తల్లి బాలమ్మ.ఈమె తండ్రి సహకార శాఖలో పనిచేస్తుండటంతో వీరి కుటుంబం ఒకచోట స్థిరంగా ఉండేదికాదు. ఆయన [[కర్నూలు]] లో పనిచేస్తున్నపుడు వై. విజయ అక్కడే జన్మించింది. తర్వాత ఆయనకు [[కడప]] కు బదిలీ కావడంతో విజయ బాల్యమంతా [[కడప]] లోనే గడిచింది. వీరు మొత్తం 10 మంది సంతానం. నలుగురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు. పది మందిలో విజయ ఐదవది.
ఈమె ఎనిమిదవ తరగతి వరకు కడప ప్రభుత్వ పాఠశాలలో చదివింది. తరువాత రెండు సంవత్సరాలు [[మద్రాసు]] లో [[వెంపటి చిన సత్యం]] గారి వద్ద నాట్యం నేర్చుకొంది. మిగిలిన పాఠశాలవిద్యని [[మద్రాసు]]లోని కేసరి పాఠశాలలో పూర్తి చేసింది. మొట్టమొదటి నాట్య ప్రదర్శనను [[కడప]]లో ఇచ్చినా తరువాత ఎక్కువభాగం [[తమిళనాడు]]లోనే ఇచ్చింది.
==సినిమా జీవితం==
వెంపటి చినసత్యం దగ్గర [[నాట్యం]] నేర్చుకుంటూ ఉండగానే సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాలు. ఆ సినిమా రామవిజేత ఫిలిమ్స్ వారి [[తల్లిదండ్రులు|తల్లిదండ్రులు (సినిమా)]]. ఇందులో హీరో గా [[శోభనబాబు]] నటించాడు. మహానటి [[సావిత్రి]] అమ్మమ్మగా, [[జగ్గయ్య]] తాతయ్యగా నటించారు.
దాదాపు 280 [[తమిళ]] సినిమాల్లో నటించింది. కొన్ని [[కన్నడ]], [[మలయాళ]], [[హిందీ]] సినిమాల్లో కూడా నటించింది.
 
"https://te.wikipedia.org/wiki/వై._విజయ" నుండి వెలికితీశారు