గణపతి స్థపతి: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపు...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెచ్చుకొన్నారు. హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు<ref>[http://www.andhrajyothy.com/artical?SID=395241 ఆయన లేడు... బుద్ధుడున్నాడు! - ఈమని శివనాగిరెడ్డి]</ref>.
ఆరేళ్ల చిరుత ప్రాయంలోనే ఉలిని చేతబట్టి అలవోకగా చెక్కు తున్న గణపతిని చూచి, ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ శిల్పి అవుతాడనుకున్న తమిళనాడులోని రామనాథపురం జిల్లా, ఎలువం కోటై శిల్పుల ఊహల్ని నిజం చేశారు పద్మశ్రీ ఎస్‌.ఎం. గణపతి స్థపతి. 1931, ఏప్రిల్‌ 26న ముత్తు స్థపతి, గౌరీ అమ్మన్‌లకు పుట్టిన గణపతి, సాంప్రదాయ ఆలయ, వాస్తు, శిల్ప శాస్ర్తాలను, కుటుంబ పెద్దల దగ్గర 17 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. శిల్పాలు చెక్కడంలోనూ, ఆలయాలను నిర్మించటంలోనూ కొత్త ఒరవడిని సృష్టించి, ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న గణపతి 1964లోనే అప్పటి మంత్రివర్యులు కల్లూరి చంద్రమౌళి దృష్టిని ఆకర్షించారు. అంతే, తమిళనాడు వదిలి, తెలుగునాట కాలుమోపారు. శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో పేరుతెచ్చుకొన్న గణపతి స్థపతి నైపుణ్యం గురించి, ఆనోటా, ఈనోటా విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, బద్రీనాధ్‌ దేవాలయ మహామండప పని అప్పగించారు. మండప భాగాలను హైదరాబాద్‌లో తీర్చిదిద్ది, బద్రీనాధ్‌కు తరలించి నిర్మించిన తీరుకు అచ్చెరువొందిన ఆమె, ఒక బంగారు గొలుసు, 60 తులాల డాలర్‌ను బహూకరించి సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పిలుపునందుకొని, తిరుమలలో వసంతరాయ మంటపాన్ని పునర్నిర్మించి, ఆస్థాన స్థపతి పదవిని దక్కించుకొన్నారు.
పంక్తి 16:
ఉలి చప్పుళ్ల మధ్య కళ్లు తెరిచి, ఉలి చప్పుళ్ల మధ్యే కళ్లుమూసిన పద్మశ్రీ గణపతి స్థపతి, ఏప్రిల్‌ 7న, దేవశిల్పి విశ్వకర్మ పిలుపుపై తిరిగిరాని లోకాలకెళ్లారు. ఈ మహాశిల్పి లేకున్నా, ఆయన సృష్టించిన శిల్పాలు, నిర్మించిన ఆలయాలు, ప్రతినిత్యం, తెలుగు శిల్పుల్ని, స్ఫూర్తిమంతం చేస్తూ, కాంతులీనుతూనే ఉంటాయి. ఆయన లేడు. హుస్సేన్‌ సాగర్‌లో బుద్ధుడున్నాడు. భద్రాచలంలో మహా మండపం ఉంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గణపతి_స్థపతి" నుండి వెలికితీశారు