నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| spouse =
}}
ప్రముఖ సినీనటి '''నిర్మలమ్మ''' తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది [[తెలుగు]] చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు.
 
==నటనా జీవితం==
నిర్మలమ్మ అసలు పేరు '''రాజమణి'''. స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[బందరు]]. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన పదహారేళ్ల వయసులో [[గరుడ గర్వభంగం]] సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి [[నందమూరి తారక రామారావు|ఎన్.టీ రామారావు‌]], [[అక్కినేని]], [[యస్వీఆర్]] ల నుంచి నేటి [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[వెంకటేష్]] వరకు ఎందరో హీరోలకు బామ్మగా[[బామ్మ]]<nowiki/>గా, అమ్మగా[[అమ్మ]]<nowiki/>గా నటించారు. [[మయూరి]], [[సీతారామరాజు]] సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.
 
[[శంకరాభరణం]], [[యమగోల]], [[పదహారేళ్ల వయసు]], [[మావిచిగురు]], [[గ్యాంగ్ లీడర్]], [[శుభసంకల్పం]], [[ఆపద్బాంధవుడు]], [[స్వాతిముత్యం]] తదితర చిత్రాల్లో వయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. [[స్నేహం కోసం]] చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. [[ఎస్వీ కృష్ణారెడ్డి]] బలవంతం మీద ఆమెను చివరి చిత్రం [[ప్రేమకు ఆహ్వానం]]లో నటించడానికి ఒప్పించాడు.
 
==కుటుంబం==
పంక్తి 28:
==ప్రముఖుల అభిప్రాయాలు==
* షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని [[తల్లి]]లా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ) అని పిలుచుకునే వాళ్ళం. — [[అక్కినేని నాగేశ్వరరావు]]
* కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో ''కరువు రోజులు'' అనే నాటకం చూసిన అలనాటి [[బాలీవుడ్]] నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేది.
* ''ఏక వీర'' నాటకంలో ''గిరిక'' పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] ''పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు'' అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
* నిర్మలమ్మ ''ఆడపెత్తనం''లో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం ''మనుషులు మారాలి'' అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన ప్రముఖ [[హిందీ భాష|హిందీ]] నటుడు ప్రాణ్. ''నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా!'' అని అన్నాడు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది.
 
==నటించిన కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలమ్మ" నుండి వెలికితీశారు