షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవిత చరిత్ర: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎బోధనలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 49:
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling The Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1999 | pages = p.29 | isbn = 8120721470}}</ref> ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 139 | isbn = 0791412687}}</ref> తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 27 [http://www.saibaba.org/satcharitra/sai27.html]</ref> నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు. తన భక్తులకు రెండు (2) ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పారు - అవి '''శ్రద్ధ''' (విశ్వాసం, భక్తి, దీక్ష), '''సబూరి''' (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 3 [http://www.saibaba.org/satcharitra/sai3.html]</ref>. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించారు.
 
రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని ఆయనతో ఉన్నవారు చెప్పారుఉంది. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 261-352 | isbn = 0791412687}}</ref> తన నివాస స్థానమైన మసీదుకు '''ద్వారకామాయి''' అని పేరు పెట్టుకున్నారు<ref name=hoiberg/>.
 
భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు.
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు