కెన్నెత్ ఆరో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1921]] లో [[న్యూయార్క్]] నగరంలో జన్మించిన కెన్నెత్ ఆరో (Kenneth Arrow)[[అమెరికా]] కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మరియు అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేత. న్యూయార్క్ సిటీ కళాశాలలో [[గణితశాస్త్రం]] లో [[1940]] లో డిగ్రీ పొందినాడు. ఆ తర్వాత [[కొలంబియా]] విశ్వవిద్యాలయం లో గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొంది [[1950]] లో [[అర్థశాస్త్రం]] లో పి.హెచ్.డి. పొందినాడు. తదనంతరం [[చికాగో]] , [[స్టాన్ఫిర్డ్]] విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేసినాడు. అర్థశాస్త్రంలో [[సాధారణ సమతౌల్య సిద్ధాంతం]] మరియు [[సంక్షేమ సిద్ధాంతం|సంక్షేమ సిద్ధాంతా]]లపై రచనలు చేసినందుకు [[1972]] లో [[బ్రిటీష్ ఆర్థికవేత్తలు|బ్రిటీష్ ఆర్థికవేత్త]] [[జాన్ హిక్స్]] తో కల్సి సంయుక్తంగా అర్థశాస్త్రపు నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో [[ఉత్పత్తి కారకాలు|ఉత్పత్తి కారకాలకు]] , పంపిణీకి, వినియాగానికి కల సంబంధాన్ని అతను సాధారణ సమతౌల్య సిద్ధాంతంలో వివరించినాడు. ఆధునిక ప్రజాస్వామ్య ప్రబుత్వాలు సంక్షేమం కోసం ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు చేసి గరిష్ట సంక్షేమం పొందాలనేది కూడా ఇతను వివరించినాడు. ఇతని యొక్క సంక్షేమ సిద్ధాంతం '''ఆరో సిద్ధాంతం''' గా ప్రసిద్ధి చెందింది.
 
 
"https://te.wikipedia.org/wiki/కెన్నెత్_ఆరో" నుండి వెలికితీశారు