ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముదిగంటి సుజాతారెడ్డి''' ప్రఖ్యాత రచయిత్రి.
==విశేషాలు==
ఈమె [[నల్లగొండ జిల్లా]], [[నకిరేకల్]] మండలం, [[ఆకారం (శాలిగౌరారం)|ఆకారం]] గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు జన్మించింది. ముదిగంటి సుజాతారెడ్డి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ., చదివి “మను, వసు చరి త్రల తులనాత్మక పరిశీలనం” అనే సిద్ధాంత వ్యాసానికి 1976లో పి.హెచ్.డి పట్టా పొందా రు. 1970లో తెలుగు అధ్యాప కురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి ముప్పై యేళ్ళ తర్వాత పదవీ విరమణ పొందారు.
 
కథ, నవల, యాత్రా కథ, సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర గ్రంథాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి.1966-69 మధ్య కాలంలో జర్మనీ దేశంలోని టుబింగన్ విశ్వవిద్యాలయం గ్రంథాల యంలోని ఓరియంటల్ విభాగంలో భారతాధ్యయన గ్రంథాలను ‘సబ్జెక్టు క్యాటలాగ్’ చేయడంలో పని చేశారు. అప్పడు సేకరించిన సమాచారంతోనే “సంస్కృత సాహి త్య చరిత్ర”ను రాశారు. సుజాతారెడ్డి గారు ప్రామాణి కంగా 6 సాహిత్య విమర్శ గ్రంథాల్ని, 3 నవలల్ని 4 కథా సంపుటాల్ని, 4 సాహిత్య చరిత్ర గ్రంథాల్ని, 2 యాత్రా కథన రచనల్ని, మరిన్ని స్త్రీలకు, తెలుగు సాహిత్యానికి, మానవ సంబంధిత గ్రంథాలను వెలువరించారు. తెలం గాణ ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్య విమర్శనా వ్యాసా లు ముద్దెర (2005) పేరిట ప్రచురితమైనాయి. ఆమె అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనల్ని గుదిగుచ్చి “ముసు రు” (2010) పేరిట ఆత్మ కథారచన చేశారు. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఎన్నో కథలు, సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికలల్లో ప్రచురితా లైనాయి. వీరు రాసిన నవల “మలుపు తిరిగిన రథ చక్రాలు” “ముడ్‌గమే రథ్‌చక్‌”్ర “విసుర్రాయి” కథలు ‘చక్కీ’ పేరుతో హిందీలోకి అనువదింప బడ్డాయి. వీరి కథలు ‘నిశ్శబ్దం-నిశ్శబ్దం’ ‘పాలు పొంగే పుణ్య భూమి’, వ్యాపార మృగం, ‘గుడిసెలు -గుడిసెలు’ ఇంగ్లీషు భాషలోకి తర్జూమా చేయబడ్డాయి. అనేక అవార్డులు పొందిన వీరిని తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిన నూతన సిలబస్ కమిటీలో సలహాదారు లుగా, పాఠశాల టెక్ట్‌బుక్ కమిటీలో సభ్యు రాలిగా, తెలంగాణ సారస్వత పరిషత్తులో ఉపాధ్యక్షురాలుగా ఉంటూ సాహిత్య కృషి చేస్తున్నారు. ముది గంటి సుజాతారెడ్డి తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని చిత్రించే కథలు రాశారు. వీటిలో రైతుల, సామాన్య జనుల, ఛిద్ర జీవితాలను, చిత్రించారు. సాఫ్ట్‌వేర్ రంగపు జీవితాలను, సన్నగిల్లు తున్న మానవ జీవితాలను, కుటుంబ వ్యవ స్థలను ప్రపంచీకరణం, వ్యాపారీకరణం, మార్కెట్ వాదం కళ్ళకు కట్టించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలంగాణ సాహిత్య చరిత్రను వెలువరించడంలో మహిళగా ఆమె అగ్రస్థానంలో ఉన్నారు. ‘రస చర్చ – ఆధునికత’లో సుజాతారెడ్డి ‘రస సిద్ధాం తాన్ని’ నవలకు కూడా వర్తింప జేయవచ్చునని ప్రతిపాదించారు. సుజాతారెడ్డి విమర్శన, పరి శోధనా రంగాల్లో విశేష కృషిచేశారు. ఇప్పటికి ఆమె రచనలపై ఒక పి.హెచ్.డి, రెండు ఎం.ఫిల్. గ్రంథాలు వచ్చాయి. ఇంకా ఎందరో పరిశోధకులు ఆమె కథలు, నవలలపై పరిశోధనలు సాగిస్తున్నారు.
==రచనలు==
# శ్రీనాథుని కవితాసౌందర్యం