డి. వై. సంపత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఒక సముద్రం -
ఒడ్డున పేద జాలరి -
అతనిలో ఆశ,పట్టుదల -
ఎదురు తిరిగే నిస్పృహ ఆటుపోటులు-
ఎగిసిపడే కెరటాలూ , నాటుపడవా ,అతని సహచరులు -

పేదల శరీర కష్టానికి భాష్యం చెప్పే ఈ దృశ్యం- ఆంధ్ర, ఆంధ్రేతర రంగస్థలాల మీద అవతరించి,ఒక ప్రత్యేకతను సంతరించుకుని [[జానపద నృత్యం|జానపద]] నృత్యరీతికి ప్రోదిచేసింది .అతి సామాన్యంగా కనిపించే ఈ దృశ్యం నృత్యనాటిక రూపాన్ని పొందింది సంపత్ కుమార్ మనస్సులో.కాగా,ఆంధ్రా జాలరికి పర్యాయ పదంగా సంపత్ కుమార్, ఆయనకు బిరుదుగా "ఆంధ్ర జాలరి" కలగలిసిపోయారు.

==బాల్యం==
''' డా.దాసరి యతిరాజ సంపత్ కుమార్ ''' (డి.వై.సంపత్ కుమార్) ([[నవంబరు 20]], [[1927]] - [[మే 27]], [[1999]]) ను '''ఆంధ్ర జాలరి ''' గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ నృత్యములోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/mp/2005/05/14/stories/2005051400960300.htm|title=Perseverance personified|date=May 14, 2005|work=The Hindu}}</ref>.

ఈయన దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం మరియు సంగీతాలను ఏకీకృతం చేశారు. ఈయన ప్రముఖ వైణికుడు అయిన శ్రీ పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద [[భరతనాట్యం]] పై శిక్షణ పొందారు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడు [[భరతనాట్యం]] , [[కూచిపూడి]] , [[యక్షగానం]] మరియు [[ఫోక్]] నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అయన కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 మరియు 1999 ల మధ్య 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖ [[నృత్యం|నృత్య]] శిక్షణా సంస్థ అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను [[విజయనగరం]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.

==అవార్డులు - సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/డి._వై._సంపత్_కుమార్" నుండి వెలికితీశారు