ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ముదిగంటి సుజాతారెడ్డి''' ప్రఖ్యాత రచయిత్రి.
==విశేషాలు==
ఈమె [[నల్లగొండ జిల్లా]], [[నకిరేకల్]] మండలం, [[ఆకారం (శాలిగౌరారం)|ఆకారం]] గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు జన్మించింది. ఈమె ఉస్మానియా [[విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ., చదివి “మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం” అనే సిద్ధాంత వ్యాసానికి 1976లో పి.హెచ్.డి పట్టా పొందింది. 1970లో తెలుగు అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి ముప్పై యేళ్ళ తర్వాత పదవీ విరమణ చేసింది. 1966-69 మధ్య కాలంలో జర్మనీ దేశంలోని టుబింగన్ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలోని ఓరియంటల్ విభాగంలో భారతాధ్యయన గ్రంథాలను ‘సబ్జెక్టు క్యాటలాగ్’ చేయడంలో సహకారం అందించింది. అప్పడు సేకరించిన సమాచారంతోనే “సంస్కృత సాహిత్య చరిత్ర”ను వ్రాసింది. ఈమె ప్రామాణికంగా 6 సాహిత్య విమర్శ గ్రంథాల్ని, 3 నవలల్ని 4 కథా సంపుటాల్ని, 4 సాహిత్య చరిత్ర గ్రంథాల్ని, 2 యాత్రా కథన రచనల్ని, మరిన్ని స్త్రీలకు, తెలుగు సాహిత్యానికి, మానవ సంబంధిత గ్రంథాలను వెలువరించింది.ఈమె [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన నూతన సిలబస్ కమిటీలో సలహాదారుగా, పాఠశాల టెక్ట్‌బుక్ కమిటీలో సభ్యు రాలిగా, తెలంగాణ సారస్వత పరిషత్తులో ఉపాధ్యక్షురాలుగా ఉంటూ [[సాహిత్యం|సాహిత్య]] కృషి చేస్తున్నది. ఇప్పటికి ఆమె రచనలపై ఒక పి.హెచ్.డి, రెండు ఎం.ఫిల్. గ్రంథాలు వచ్చాయి. ఇంకా ఎందరో పరిశోధకులు ఆమె [[కథలు]], నవలలపై[[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లపై పరిశోధనలు సాగిస్తున్నారు<ref>{{cite news|last1=సంపాదకుడు|title=అనుపమ అక్షర కృషీవలురు తెలంగాణ తేజాలు|url=http://manatelangana.news/2016/06/telangana-poets-in-telangana/|accessdate=10 April 2017|work=మన తెలంగాణ|date=13 Jun 2016}}</ref>.
 
==సాహిత్యసేవ==
కథ, నవల, యాత్రా కథ, సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర గ్రంథాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈమె. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించింది. ఎన్నో కథలు, సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికలల్లో ప్రచురితాలైనాయి. ఈమె నవలలు, కథలు హిందీ, ఇంగ్లీషు భాషలలోనికి తర్జుమా చేయబడ్డాయి. ఈమె తన రచనలలో తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని, [[వ్యవసాయదారుడు|రైతుల]], సామాన్య జనుల, ఛిద్రజీవితాలను చిత్రించింది. సాఫ్ట్‌వేర్ రంగపు జీవితాలను, సన్నగిల్లుతున్న మానవ జీవితాలను, కుటుంబ వ్యవస్థలను ప్రపంచీకరణం, వ్యాపారీకరణం, మార్కెట్ వాదం కళ్ళకు కట్టేటట్లు తన కథలలో వర్ణించింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలంగాణ సాహిత్య చరిత్రను వెలువరించడంలో మహిళగా ఈమె అగ్రస్థానంలో ఉంది. ‘రస చర్చ – ఆధునికత’లో సుజాతారెడ్డి ‘రస సిద్ధాంతాన్ని’ నవలకు కూడా వర్తింప జేయవచ్చునని ప్రతిపాదించింది.
 
==రచనలు==