ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ముదిగంటి సుజాతారెడ్డి''' ప్రఖ్యాత రచయిత్రి.
==విశేషాలు==
ఈమె [[నల్లగొండ జిల్లా]], [[నకిరేకల్]] మండలం, [[ఆకారం (శాలిగౌరారం)|ఆకారం]] గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు దొరల కుటుంబంలో జన్మించింది. ఈమె చిన్న వయసులో కమ్యూనిస్టు పోరాట ఉద్యమ ప్రభావం వల్ల ఈమె కుటుంబం ఆంధ్రప్రాంతాలకు వలస వెళ్ళింది. కొన్నాళ్ళు గుంటూరు జిల్లా అద్దంకిలోనూ, ఆ తర్వాత నరసరావుపేటనరసరావుపేటలోనూ ఈమె కుటుంబం కలిసి నివసించింది<ref>{{cite web|last1=జంపాల|first1=చౌదరి|title=ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ|url=http://pustakam.net/?p=8031|website=పుస్తకం.నెట్|accessdate=10 April 2017}}</ref>.
 
తెలంగాణా విమోచనం జరిగి, కమ్యూనిస్టు పోరాటం ఉధృతం తగ్గాక ఈమె కుటుంబం తమ ప్రాంతానికి తిరిగి వచ్చి నల్గొండలో స్థిరపడింది. సుజాత 1950లో నల్లగొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతిలో చేరింది. అప్పుడే ‘వెల్లోడి’ ప్రభుత్వంలో స్కూళ్ళలో ఉర్దూ బదులు తెలుగు మాధ్యమం వచ్చింది. హెచెస్‌సి (పదవ తరగతి) పాస్ అయ్యాక అతి కష్టం మీద కాలేజీలో చేరటానికి ఇంట్లో అంగీకరించారు. 1956లో [[హైదరాబాదు]]లోని రాజబహద్దరు వెంకట రామారెడ్డి మహిళాకళాశాల (ఆర్‌బివీఅర్ఆర్ ఉమెన్స్ కాలేజ్)లో పియుసీలో చేరింది. అక్కడే రెడ్డి హాస్టల్‌లో వసతి. ఇంగ్లీషు మాధ్యమంతోనూ, నగర సంస్కృతితోనూ ఇబ్బందులు ఎదుర్కొని పియుసీ పూర్తి చేసింది. పియుసీ అయేటప్పటికి నల్గొండలో నాగార్జున కాలేజీ ఏర్పడింది. అక్కడ బి.ఏ మొదటి సంవత్సరం చదివాక గోపాల్ రెడ్డిగారితో 1959లో వివాహమైంది. ఈ దంపతులకు వాసవిక, ఉదయన అనే పిల్లలు కలిగారు.