సుప్రీత్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''సుప్రీత్''' ఒక తెలుగు సినీ నటుడు.<ref name="filmibeat">{{cite web|last1=Filmibeat|title=Supreet|url=http://www.filmibeat.com/celebs/supreet.html|website=Filmibeat|publisher=Filmibeat|accessdate=4 July 2016}}</ref> ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు.<ref name="dosthana">{{cite web|last1=Dosthana|first1=Movies|title=Supreet Biography, Profile|url=http://movies.dosthana.com/profile/supreet-biography|website=movies.dosthana.com|publisher=Dosthana|accessdate=4 July 2016}}</ref> [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]], [[మర్యాద రామన్న]] సినిమాలో ప్రతినాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. విక్రమార్కుడు హిందీ రీమేక్ సినిమా రౌడీ రాథోడ్ లో టిట్లా అనే పాత్రతో [[బాలీవుడ్]] లో ప్రముఖ పాత్రలో నటించాడు. అంతకు మునుపు గజినీ [[హిందీ భాష|హిందీ]] రీమేక్ లో చిన్న పాత్ర కూడా పోషించాడు.
 
== కెరీర్ ==
సుప్రీత్ చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. [[తేజ]] [[జయం (సినిమా)|జయం]] సినిమాకు ఆడిషన్లు జరుగుతున్నప్పుడు తృటిలో అవకాశం కోల్పోయాడు. తరువాత తేజ అతన్ని కలిసి స్వంతంగా ఆల్బం తయారు చేసుకుని ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. తరువాత [[పవన్ కల్యాణ్]] మొదటి సారిగా దర్శకత్వం వహించిన [[జాని]] అనే సినిమాలో అవకాశం వచ్చింది. తరువాత [[రాజమౌళి]] దర్శకత్వంలో వచ్చిన [[సై]] సినిమా కోసం [[రగ్బీ]]లో శిక్షణ కూడా పొందాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడైన భిక్షు యాదవ్ ([[ప్రదీప్ రావత్]]) ప్రధాన అనుచరుడిగా నటించాడు.
 
అతనిలో ప్రతిభను గుర్తించిన రాజమౌళి తన తరువాత సినిమా [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] లో [[ఉప్పలపాటి ప్రభాస్ రాజు|ప్రభాస్]] స్నేహితుల్లో ఒకడిగా అవకాశం ఇచ్చాడు. అయితే తర్వాత ఎందుకో కాట్రాజు పాత్ర కోసం ఎంపిక చేశాడు. సుప్రీత్ అయిష్టంగానే అందుకు అంగీకరించినా ఆ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి నటుడుగా నిలబెట్టింది. తరువాత చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు.<ref name="sakshi">{{cite news|last1=Nelapudi|first1=Sameera|title=ఆయన లేకపోతే నేను లేను|url=http://telugucinemacharitra.blogspot.com/2012/02/blog-post_04.html|accessdate=5 July 2016|work=Sakshi|agency=Sakshi|publisher=Jagati Publications}}</ref>
 
హీరోగా అతనికి అవకాశాలు వచ్చినా తను ఆ పాత్రలకు సరిపడనని అవి చేయలేదు. అతనికి వ్యక్తిగతంగా [[కోట శ్రీనివాసరావు]], [[మోహన్ బాబు]] నటన అంటే ఇష్టపడతాడు.
"https://te.wikipedia.org/wiki/సుప్రీత్" నుండి వెలికితీశారు