సప్తగిరి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
డిసెంబరు 2016 లో వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా కథానాయకుడయ్యాడు.
== వ్యక్తిగత జీవితం ==
సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. ఇతను [[చిత్తూరు జిల్లా]], [[ఐరాల]] ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. ఇంటర్ వరకు చదివాడు. తరువాత ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదు. ఇంటర్ పరీక్షలయ్యాక ఒక రోజు తిరుమలలో[[తిరుమల]]<nowiki/>లో [[వెంకటేశ్వర స్వామి]] దర్శనానికి వెళ్ళాడు. అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని ''సప్తగిరి'' అని సంబోధించడంతో అదెందుకో బాగుందనిపించి తరువాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] చదివేటప్పుడే సినిమాలు చూడ్డం బాగా అలవాటు అయ్యింది. అలాగని కేవలం చూసి వదిలేయడమే కాకుండా వాటిని నిశితంగా పరిశీలించేవాడు. క్రమంగా సినీ రంగం వైపు ఆసక్తి కలిగింది.
 
== కెరీర్ ==
=== తొలినాళ్ళు ===
ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాదుకు[[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]]<nowiki/>కు వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాలనుకున్నాడు. అక్కడ మల్టీమీడియా కోర్సు చేస్తానని ఇంట్లో చెప్పి హైదరాబాదుకు వచ్చాడు. తనకు అన్నయ్య వరసైన సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉండేవాడు. మొదట్లో దర్శకత్వం వైపే ఆసక్తి ఉండేది కానీ నటనలో ఏమాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లీషులో పరిజ్ఞానం పెంచుకుందామని ఎస్. ఆర్. నగర్ లోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. కానీ రెండు నెలలు గడిచాక అందులో పురోభివృద్ధి లేకపోవడంతో దానిని వదిలేశాడు. సహాయ దర్శకుడిగా అవకాశం కోసం స్టూడియోల చుట్టూ తిరిగే వాడు.
 
=== సహాయ దర్శకుడిగా ===
పంక్తి 32:
తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన [[బొమ్మరిల్లు (2006 సినిమా)|బొమ్మరిల్లు]] సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాత [[దిల్ రాజు]]<nowiki/>కు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. దాంతో బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా తెరపై కనిపించాడు. తర్వాత భాస్కర్ దగ్గరే [[పరుగు (సినిమా)|పరుగు]] సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ ఈ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు [[ఆనంద్ రంగా]] తీసిన [[ఓయ్!|ఓయ్]] సినిమాలో నటించాడు. నటనలో అవకాశాలు ఎక్కువగా రాసాగాయి. [[కందిరీగ (సినిమా)|కందిరీగ]], [[దరువు (సినిమా)|దరువు]], [[నిప్పు]], [[మంత్ర]], [[గబ్బర్ సింగ్|గబ్బర్‌ సింగ్‌]] లాంటి సినిమాల్లో నటించాడు. అదే సమయంలో దర్శకుడు [[దాసరి మారుతి|మారుతి]] తీసిన [[ఈ రోజుల్లో]] సినిమా అతి తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమా సమయంలో సప్తగిరి, మారుతి కలిసి చాలా రోజులు పనిచేశారు. ఆ పరిచయంతో మారుతి తర్వాత తీస్తున్న [[ప్రేమకథా చిత్రమ్]] లో అవకాశం కల్పించాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని తర్వాత [[దృశ్యం (సినిమా)|దృశ్యం]], [[మనం]], [[పవర్ (సినిమా)|పవర్]], [[ఎక్స్‌ప్రెస్ రాజా|ఎక్స్ ప్రెస్ రాజా]], [[సోగ్గాడే చిన్నినాయనా|సోగ్గాడే చిన్ని నాయనా]], [[మజ్ను]] తదితర చిత్రాల్లో నటించాడు.
 
ఒక రోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని [[తెలుగు]] నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో కథానాయకుడిగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు. అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఆ సినిమాను నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు. [[సప్తగిరి ఎక్స్ ప్రెస్ (సినిమా)|సప్తగిరి ఎక్స్ ప్రెస్]] అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ సినిమా విడుదలైంది. ఇది సప్తగిరికి కథానాయకుడిగా మొదటి సినిమా.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(నటుడు)" నుండి వెలికితీశారు