"ప్రతివాది భయంకర శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (2), లో → లో (7), ల్లొ → ల్లో , కు → కు (4), గా → గా , using AWB)
చి
}}
'''పి.బి.శ్రీనివాస్''' ([[సెప్టెంబరు 22]], [[1930]] - [[ఏప్రిల్ 14]], [[2013]]) (పూర్తి పేరు '''ప్రతివాది భయంకర శ్రీనివాస్''')<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ప్రముఖ [[చలనచిత్రం|చలనచిత్ర]] నేపథ్యగాయకుడు. ఈయన తన [[మాతృభాష]] అయిన తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో కంటే [[కన్నడ]], [[తమిళం|తమిళ]] చిత్రాలలో ఎక్కువ [[పాటలు]] పాడాడు. ఆయన [[హిందీ]], [[మలయాళం]] చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం [[రాజ్‌కుమార్]]‌కు ఈయన ఎన్నో [[గీతాలు]] ఆలపించాడు. ఈయన [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం|తమిళ]], [[మలయాళం]], [[హిందీ]], [[ఉర్దూ]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[సంస్కృతం|సంస్కృత]] భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం [[సువర్ణ గళం]]గా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా [[జాతక ఫలం]] చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.<ref>[http://en.wikipedia.org/wiki/P_B_Srinivas]</ref>
 
==జీవితం==
తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాథమణి బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు.<ref>http://eemaata.com/em/issues/201305/2099.html?allinonepage=1</ref>
 
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "[[మిస్టర్ సంపత్]]"తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ "తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"<ref>[http://www.hindu.com/mp/2009/01/03/stories/2009010353731300.htm The Hindu: Harishchandra (1955)]</ref>లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో [[పి.సుశీల]]తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ [[రాజ్ కుమార్]]కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. [[తమిళ భాష|తమిళ]] పరిశ్రమలో [[జెమిని గణేశన్]]కు అనేక పాటలు పాడారు. ఆయన పాటలలో ప్రముఖమైనది "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[శివాజీ గణేశన్]] లకు పాడాడు. 1964 లో [[మై భీ లడకీ హూ]] అనే [[హిందీ భాష|హిందీ]] చిత్రంలో [[లతా మంగేష్కర్]]తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు [[జెమినీ గణేశన్]], [[ముత్తురామన్]], [[రవిచంద్రన్]], [[జైశంకర్]].
 
"పావా మనిప్పు" అనే చిత్రంలో [[కన్నదాసన్]] వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను [[ఎం.ఎస్.విశ్వనాథన్]] మరియు [[టి.కె.రామమూర్తి]] గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి [[ఆడుతా వీట్టుప్పెన్]] అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ ప్రముఖ గాయనీమణులైన [[పి.సుశీల]], [[ఎస్.జానకి]], [[పి.భానుమతి]], [[కె.జమునా రాణి]], [[ఎల్.ఆర్.ఈశ్వరి]] మరియు [[లతా మంగేష్కర్]] ల సరసన పాడాడు.
[[చైన్నై]] లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయములో ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు.<ref>[http://www.hinduonnet.com/2001/06/11/stories/13110464.htm The Hindu : Bit of drive-in nostalgia]</ref>
 
పి.వి.శ్రీనివాస్ [[ఏప్రిల్ 14]], [[2013]]లో తన 82 వయేట [[చెన్నై]] లోని ఆసుపత్రిల్ లో గుండె పోటుతో అస్తమించాడు.
 
==వివిధ చిత్రాలలో పాడిన పాటలు==
1,86,625

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2095003" నుండి వెలికితీశారు