మహీధర నళినీమోహన్: కూర్పుల మధ్య తేడాలు

30 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
| weight =
}}
'''మహీధర నళినీ మోహన్''' 1933వ సంవత్సరంలో [[తూర్పు గోదావరి]] జిల్లా [[ముంగండ]] గ్రామంలో జన్మించాడు. ఆయన మాటలలో, "భారత స్వతంత్ర సమరంలో ముగ్గురు కుటుంబ సభ్యులని కారాగారానికి పంపిన దేశభక్తుల ఇంట్లో, మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలకు వేదికగా నిలచిన ముంగిట్లో - ఛాందసాన్ని వెలివేసిన పండిత కుటుంబంలో - 1933లో, తూర్పు గోదావరి జిల్లా ముంగండలో జననం." సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు [[మహీధర రామమోహనరావు]] ఈయన తండ్రి. బహు గ్రంధకర్తైన [[మహీధర జగన్మోహనరావు]] ఈయన పినతండ్రి. నళినీ మోహన్ పాపులర్ [[సైన్స్]] రచనలు రాయడంలో ప్రసిద్ధుడు. తనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందికైన పదాల్లో సామాన్యుల భాషలో రాయడంలో ఈయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. తెలుగులో పాపులర్ సైన్స్‌కు ఆయన చేసిన సేవ ఎనలేనిది. పదిహేనవ ఏటనుండి [[కవిత్వం|కవిత్వ]] రచనలో ప్రవేశం ఉన్న నళినీ మోహన్ జనరంజక విజ్ఞానంలో దరిదాపు 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, కవితలూ, వ్యాసాలూ వగైరా 10 పుస్తకాల వరకూ వ్రాశాడు. వివిధ పత్రికలలో ఇతని రచనలు దాదాపు 1,000 పైగానే ప్రచురితం అయి ఉంటాయి. 1968లో [[దువ్వూరి రామిరెడ్డి]] విజ్ఞాన బహుమతిని, [[1987]]లో [[ఇందిరా గాంధీ విజ్ఞాన బహుమతి]]ని అందుకున్నాడు. కొన్నాళ్ళు ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడి అక్టోబరు [[2005]]లో మరణించాడు.
 
==జీవితం==
1,96,411

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2095016" నుండి వెలికితీశారు