జాన్ నాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[గేమ్ థియరీ]] ని ప్రతిపాదించి ఆర్థిక శాస్త్రాన్ని మలుపు త్రిప్పి మహోన్నత శిఖరాలకు చేర్చిన [[అమెరికా]] కు చెందిన గణిత శాస్త్రజ్ఝుడు జాన్ ఫోర్బెస్ నాష్. [[1958]] లో [[స్కిజోఫ్రీనియా]] అనే మానసిక రుగ్మతకు గురై, [[1990]] లో నాష్ మళ్ళి పూర్వపు మేధాశక్తిని పొందినాడు. నాష్ ప్రతిపాదించిన సిద్ధాంతం '''నాష్ సమతాస్థితి''' గా ప్రసిద్ధి చెందింది. [[1994]] లో ఆర్థిక శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] పొందినాడు. ప్రస్తుతం ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఒక మహా శాస్త్రవేత్త. తన జీవితం ఆధారంగా నిర్మించిన A beautiful Mind చిత్రం 2002 లో ఉత్తమ చిత్రంగా [[ఆస్కార్ అవార్డు]] పొందింది.
==బాధాకరమైన జీవితం==
పరిశోధనలతో పురోగమిస్తున్న నాష్ జీవితంలో 29 వ ఏటా స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మత సంక్రమించింది. అప్పటి నుంచి అతని మానసిక ప్రవృత్తి మారిపోయింది. ఏవేవో ఆలోచనలతో, సంభాషణలతో పిచ్చిపిచ్చిగా గడిపేవాడు. తర్వాత [[న్యూజెర్సీ]] లోని మానసిక చికిత్సాలయంలో బంధించారు. తీవ్రమైన చికిత్సా విధానాలకు గురైనాడు. వ్యాధి నయం కాకపోవడంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినాడు.
"https://te.wikipedia.org/wiki/జాన్_నాష్" నుండి వెలికితీశారు