కొండవీటి గుర్నాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొండవీటి గుర్నాథరెడ్డి''' ప్రముఖ [[స్వాతంత్ర్య సమరయోధుడు]], [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] మాజీ శాసన సభ్యులు. ఈయన స్వస్థలం [[నల్గొండ జిల్లా]], [[మునుగోడు]] మండలం, [[పలివెల (మునుగోడు మండలం)|పలివెల]] గ్రామం.
 
[[భారత స్వాతంత్ర్యోద్యమము]] లోనూ, [[తెలంగాణ సాయుధ పోరాటం]] లోనూ పిడికిలెత్తిన ఉద్యమకారుడు... వందలాది ఎకరాల భూమిని పంచి తుదిశ్వాస విడిచేదాకా నిరాడంబర జీవనం సాగించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నిస్వార్థ సేవకుడు.
పంక్తి 5:
పదహారేండ్ల వయస్సులోనే 1938లో [[హైదరాబాద్‌]]లో జరిగిన [[సత్యాగ్రహం]]లో పాల్గొన్నారు. దేశ నాయకులైన [[గాంధీ]], [[నెహ్రూ]] ఉపన్యాసాల కోసం హైదరాబాద్ నుంచి [[ముంబై]] వరకు 18 రోజుల పాటు కాలినడక సాగించారు. నిజాం నిరంకుశపాలన, కట్టు [[బానిసత్వం]], [[వెట్టి చాకిరీ]]లకు చలించి 1942లో [[కమ్యూనిస్టు]] ఉద్యమంలో చేరారు.
 
స్వామి రామానందతీర్థ పిలుపు మేరకు 1947లో వంద మంది దళ సభ్యులను చైతన్య పరచి సాయుధ పోరాట ఉద్యమాన్ని సాగించారు. పిత్రార్జితంగా వచ్చిన వ్యసాయ భూములను పేదలకు పంచారు. దొరల పెత్తంధార్ల బెదిరింపులకు లొంగకుండా ఊరూరా ఎర్రజెండాలను నాటి [[వెట్టి చాకిరి]]కి వ్యతిరేఖంగా ఉద్యమించారు. ఆ సమయంలో తొమ్మిది నెలల పదిహేను రోజుల [[కారాగారము|జైలు]] జీవితం అనుభవించి చిత్రహింసలకు గురయ్యారు.
 
== రాజకీయ ప్రవేశం ==
పంక్తి 14:
ఓ వైపు సాయుధ పోరాటంలో, మరోవైపు సంఘ సేవా కార్యక్రమలో పాల్గొంటూనే 30 ఏళ్ల పాటు రాత్రి పాఠశాలలు నడిపారు. సైన్స్, గ్రంథ పఠనంపై తనకున్న ఆసక్తిని ప్రజలకు పంచేందుకు గెలిలీయో పేరిట ప్రజల విరాళాలతో విజ్జాన గ్రంథాలయాన్ని నిర్మించారు.
 
ఆయన భుజంపై ఎప్పుడు చూసినా ఓసంచి, తెల్లటి దోవతి, లాల్చి ఆయన ఆహర్యం. [[వృద్ధాప్యం]] బాధిస్తున్నా చనిపోయేవరకు పలు మండలాల్లోని పాఠశాలల్లోని విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవారు. ప్రభుత్వం నిర్వహించే సభలకు, సమావేశాలకు స్వచ్చందంగానే హాజరయ్యేవారు.
 
== మరణం ==
గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో[[అనారోగ్యం]]<nowiki/>తో బాధపడుతున్న ఆయన... [[31 ఆగష్టు]], [[2014]] ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం స్వగ్రామమైన పలివెల నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా [[నల్లగొండ]], [[హైదరాబాద్‌]]లో స్థిరపడ్డారు. తాను మాత్రం స్వగ్రామంలోనే ఉంటున్నారు.
 
== మూలాలు ==