కారాగారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (5), హైదరాబాద్ → హైదరాబాదు, విశాఖపట్టణం → విశాఖపట using AWB
→‎ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్రీయ కారాగారాలు: +రాజమండ్రి కేంద్ర కారాగారం లింకు
పంక్తి 17:
== ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్రీయ కారాగారాలు ==
రాజమండ్రి, హైదరాబాదు‌లోని చెర్లపల్లి, [[చంచల్‌గూడ జైలు]], అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం లలో 6 సెంట్రల్ జైళ్ళున్నాయి.
;[[రాజమండ్రి కేంద్ర కారాగారం|రాజమండ్రి సెంట్రల్ జైలు]]: ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణం. ఇది ఒక కోట దీనిని 2-3 శతాబ్ధాల క్రితం డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో కారాగారం క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థానం కలిపించబడింది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైఘీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం డచ్ వారి పరిపాలనలో ఉంది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్ఫటు చేశారు, డినిలో ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉన్నది, మూడావది పాత సబ్ కల్టకర్ ఆఫీసు వెనుక అప్సర హొటలు దగ్గర ఉంది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టాడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్తగతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను కారాగారంగా మార్చారు. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.
 
== క్షమాబిక్ష ==
"https://te.wikipedia.org/wiki/కారాగారం" నుండి వెలికితీశారు