"ప్రాణాయామం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక (4), నందు → లో (2), లొ → లో (3), లో → లో (2), కూడ → కూడా (2), using AWB)
చి
'''ప్రాణాయామం''' (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం [[మనస్సు]]ను ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. [[పతంజలి]] మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
 
ప్రాణాయామము ముఖ్యముగా త్రివిధములు. 1. కనిష్ఠ ప్రాణాయామము 2. మధ్యమ ప్రాణాయామము. 3. ఉత్తమ ప్రాణాయామము. సాధకులు ప్రథమములో ఉదయం నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సుఖాసీనులై ఎడమ ముక్కుతో గాలిని నెమ్మదిగా పీల్చి రెండు ముక్కులను బంధించి, కుంభించి, పిమ్మట కుడి ముక్కుతో నెమ్మదిగా వదులుట ఒకటవ ఆవృతము తిరిగి కుడి ముక్కుతో నెమ్మదిగా బాగా గాలిని పీల్చి, కుంభించి, ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగా వదిలివేయుట రెండవ ఆవృతము. ఇట్లు ఆరు ఆవృతములతో ఆరంభించి (అనగా ఒక మాత్ర) క్రమముగ పెంచుచు పూటకు 12 ఆవృతములు (రెండు మాత్రలు) చొప్పున మూడు పూటలా 3*12 = 36 ఆవృతములు చేయుట కనిష్ఠ [[ప్రాణాయామము]]. 72 ఆవృతములు చేయుట మధ్యమ ప్రాణాయామము. 108 ఆవృతములు చేయుట ఉత్తమ ప్రాణాయామము.
 
ప్రాణశక్తి ముఖ్యంగా [[ఐదు]] రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. [[ప్రాణం]], 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.
 
==ముఖ్యమైన దశలు==
 
== త్రిబంధము==
సమతలమై చక్కని ప్రాణవాయువు లభ్యమయ్యే బహిరంగ ప్రదేశమున, పద్మాసనము లేక వజ్రాసనము లేక సుఖాసనము ఏదో ఒక విధముగా కుర్చొని వెన్ను పామును, మెడను, శిరస్సును సమానముగా నిలబెట్టవలెను. ఎడమ చేతిని యోగ దండము వలె నిలబెట్టి రెండు భూజములను ఎగుపకు సమానముగ పెట్టవలెను. అప్పుడు కుడిచేతి బ్రొటన వ్రేలును - కుడి ముక్కు (అనగ సూర్యనాడి) పనను, ఉంగరపు వ్రేలును ఎడమముక్కు (అనగ చంద్రనాడి) మీదను, మధ్య వ్రేళ్ళను ముక్కు మీదను ఉంచవలెను. ఇప్పుడు ఊపిరితిత్తులలోని గాలిని ఎడమముక్కు ద్వారా రేచించవలెను ( అనగ పూర్తిగా గాలిని బైటకు వదలి వేస్తూ తలను వంచవలెను). తరువాత గాలిని నెమ్మదిగా చంద్రనాడితో సగము ముక్కును మూసి ఒత్తిడిగా లోనికి ఒకే పట్టుతో ఊపిరితిత్తుల నిండా పీల్చుతూ తలను పైకి ఎత్తవలెను. తరువాత మెడను పూర్తిగా వంచి గడ్డము చాతికి ఆనించి వాయువును కుంభించివేయునది '''జాలంధర బంధనము'''. తరువాత పొట్టను వెనుకకు లాగిన '''ఉడ్యాణబంధము'''; ఆసనమును (Anus) బంధించిన '''మూల బంధము''' అందురు. అనగ త్రిబంధములు వేసి వాయువును కుంభించవలెను. అప్పుడు ఈ క్రింది రేషియో ప్రకారం (పూరక కుంభక రేచకములను అనుసరించి కుంభించిన వాయువులను త్రిబంధములను సడలించి, కుడిముక్కుతో సగము బిగించి బహునెమ్మదిగా వాయువును రేచించి ఒదలి వేయవలెను. దీనినొక వృత్తము అందురు. తిరిగి అదే విధముగ రేచించిన కుడి ముక్కుతో నెమ్మదిగా పురించి, మెడవంచి త్రివిధబంధములతో బంధించి, తిరిగి ఎడమ ముక్కుతో[[ముక్కు]]<nowiki/>తో చాల నెమ్మదిగ రేచించుట మరియొక ఆవృతము అగును. ఇట్లు మూడు సార్లు చేయుట ఒక మాత్ర అగును.
 
1:4:2 నిష్పత్తిలో వాయువును బంధించవలెను. అనగ గాలిని 10 సెకండ్ల కాలము నెమ్మదిగా చంద్రనాడి వెంట లోనికి పీల్చి 40 సెకండ్లకాలము వరకు త్రివిధబంధములు వేసి కుంభించి తిరిగి సూర్యనాడితో 20 సెకండ్ల కాలములో బహు నెమ్మదిగా రేచించవలెను. ఈవిధముగ ఈ నిష్పత్తికి భిన్నము లేకుండ పూరక కుంభక రేచకములను నిర్ణయించుకొని పాణాయామము చేయుట మంచిది. ఇది ప్రథమములో 10 సెకండ్లతో పురకము ప్రారంభించిన దానిని 15 సెకండ్లకు అనగ 15:60:30 నిష్పత్తికి పెంచుకొని చేయవచ్చును.
 
==ప్రాణాయామ పద్ధతులు==
ప్రాణాయామం ముఖ్యంగా [[ఎనిమిది]] రకాలు. ఇవి [[అష్టకుంభకాలు]].
 
=== [[1.సూర్య భేదసము]] ===
1,89,614

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2098329" నుండి వెలికితీశారు